Begin typing your search above and press return to search.

రాసలీలల స్వామిని బ్లాక్‌ మెయిల్ చేసి లక్షలు నొక్కేశారు

By:  Tupaki Desk   |   3 Nov 2017 5:35 PM GMT
రాసలీలల స్వామిని బ్లాక్‌ మెయిల్ చేసి లక్షలు నొక్కేశారు
X
సినీ నటితో రాసలీలలు జరిపి - ఆ వీడియో లో బయటకు పొక్కడంతో పరువు పోగొట్టుకున్న దయానంద స్వామీజీ మొత్తం వ్యవహారంపై నోరు విప్పారు. నటితో కలిసి దొరికిపోయిన తరువాత తనను ఎవరు ఎలా బ్లాక్ మెయిల్ చేశారు.. ఎంత నొక్కేశారన్న విషయాలు ఆయన వెల్లడించారు. అయితే.. ఆయన అజ్ఞాతం నుంచే వెల్లడించారు. ఒక వీడియోను తయారు చేసి దాన్ని మీడియా సంస్థలకు పంపించారు.

2014లో రహస్యంగా రాసలీలల వీడియో తీశారని ఆయన ఆ వీడియో లో వెల్లడించారు. 2014 జనవరి 6వ తేదీన తాను పని మీద బయటకు వెళ్లి మఠానికి తిరిగి వస్తున్న సమయంలో కొందరు అడ్డగించి ఈ వీడియో చూపించి రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. అయితే... తాను అంత ఇవ్వలేనని చెప్పడంతో మరో వ్యక్తి పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని రూ.45 లక్షలకు డీల్ కుదిర్చాడన్నారు. చెప్పిన ప్రకారం మొత్తం డబ్బులు ఇచ్చేసిన తరువాత పోలీసుగా పరిచయం చేసుకున్న వ్యక్తి వచ్చి తన వాటా ఇవ్వాలంటూ మరో రూ. 10 లక్ష్లలు తీసుకున్నాడని చెప్పారు. ఆ తరువాత మరో వ్యక్తి వచ్చి బెదిరించి రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించాడని ఆయన ఆ వీడియోలో వెల్లడించాడు.

అయితే... తాను డబ్బు ఇవ్వకుండా ఆత్మహత్యాయత్నం చేశానని.. అయినా వారు జాలి చూపకుండా సీడీలను బయట పెట్టి తన పరువు తీశారని దయానంద అంటున్నారు. అయితే దయానంద ఎక్కడ ఉన్నారు ? ఎక్కడ నుంచి మాట్లాడారన్నది ఈ వీడియోతో తెలియలేదు. స్వామీజీతో రాసలీలలు జరిపిన కన్నడ నటి ఆత్మహత్యాయత్నం చేసిన కొద్దిరోజులకే ఆయన ఇలా వీడియో విడుదల చేశారు.