Begin typing your search above and press return to search.
ఇద్దరే ఎందుకు.. నలుగురిని కనండి!
By: Tupaki Desk | 26 Nov 2017 6:31 PM GMTఇద్దరు హిందూ గురువులు హిందూ సమాజానికి కీలక సూచనలు చేశారు. అయితే అవి సూచనలు అని వహిందూ మతాభిమానులు అంటుండగా...కాదు రెచ్చగొట్టే కామెంట్లు అంటూ...కొందరు విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే...విశ్వ హిందూ పరిషద్ ఉడిపి శాఖ ఆలిండియా ధర్మ సన్సద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా స్వామి గోవింద్ దేవ్ గిరి మాట్లాడుతూ హిందువుల జనాభా రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాను సమం చేయాలంటే హిందూ దంపతులు ఒక్కొక్కరు నలుగురిని కనాలని ఆయన పిలుపునిచ్చారు.
హిందూ మతంలోని అన్ని కులాలవాళ్లు అన్ని ఆలయాలకు వెళ్లేలా, అన్ని శ్మశానాలను వాడుకునేలా చేయాల్సిన అవసరం ఉన్నదని దేవ్ గిరి అన్నారు. హిందువుల జనాభా తగ్గిన ప్రాంతాలను మన దేశంలో కోల్పోతూ వస్తున్నదని, అందువల్ల ఇద్దరు పిల్లల సిద్ధాంతాన్ని హిందువులకు వర్తింపజేయకూడదని ఆయన స్పష్టంచేశారు. ఇక గోరక్ష పేరుతో కొందరు క్రిమినల్స్ తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం ఉమ్మడి పౌర స్మృతి ప్రవేశపెట్టే వరకు ఇలా చేస్తే.. హిందూ జనాభాకు ఓ స్థిరత్వం వస్తుందని స్వామి దేవ్ గిరి అభిప్రాయపడ్డారు. కాగా, ఈ వ్యాఖ్యలు సహజంగానే వివాదాన్ని సృష్టించాయి. జనాభానియంత్రణపై ఇలాంటి కామెంట్లు ఎందుకని పలువురు ప్రశ్నించగా...కొన్ని మతాలలో అడ్డూ అదుపూ లేని జనాభా విషయంలో లౌకికవాదులనే వారు ఎందుకు స్పందించరని...హిందుత్వవాదులు ప్రశ్నించారు.
కాగా, మరో హిందూ గురువు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి హిందూ కుటుంబం నలుగురు పిల్లలకు జన్మనివ్వాలని స్వామి గోవింద్ గిరి మహరాజ్ వ్యాఖ్యలు చేసిన అనంతరం మహ్వాచార్య ఆశ్రమంలోని స్వామి నరేంద్రనాథ్ మరో వివాదాస్పద ప్రకటన చేశారు. హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిందువులు ఆయుధాలు పట్టుకొని తమను తాము రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్రనాథ్ మాట్లాడుతూ.. దాడులకు గురవుతున్న హిందూ సమాజానికి పెద్ద ముప్పు పొంచిఉన్నదని అన్నారు. దేశంలోని ఆలయాలు ఉగ్రవాదులకు లక్ష్యంగా మారాయని, చివరకు పార్లమెంట్‌ను కూడా విడువలేదని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లతో ఏమైనా ప్రయోజనం ఉందా అని ప్రశ్నిస్తూనే.. కనీసం ఒకగంట సమాజ రక్షణ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మీ వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని ఓ వార్తాపత్రిక ప్రశ్నించగా.. నరేంద్రనాథ్ స్పందిస్తూ.. తాను హింసను ప్రోత్సహించడంలేదని, రాబోయే ముప్పు గురించి అవగాహన కల్పిస్తున్నానని చెప్పారు.