Begin typing your search above and press return to search.
అడ్డెడ్డెడ్డె... సాంబా రాస్కో బీజేపీకి 70 సీట్లు
By: Tupaki Desk | 27 Nov 2018 5:21 PM GMTమన స్ఫూర్తిగా తీసుకోవాలి గాని రాజకీయాల్లో ఉన్నంత పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులు ఇంక ఎందులోనూ ఉండవు. ఎన్నికలు జరిగినపుడు బాగా గమనించండి. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన అన్ని పార్టీల అభ్యర్థులు తామే గెలుస్తాం అనుకుంటారు. కానీ ఒక చోట ఒక్కరే గెలుస్తారు. బయట నుంచి చూసినపుడు మాత్రమే మనకు ఎవరు గెలుస్తారన్న క్లారిటీ ఉంటుంది గాని, వారి మాటలు స్వయంగా వింటే అందరి వద్ద పర్ ఫెక్ట్ లాజిక్ లు ఉంటాయి.
ఇక వీళ్లందరికి కాన్ఫిడెన్స్ లో తాతలా కనిపిస్తున్నాడు స్వామి పరిపూర్ణానంద. ఇటీవలే ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పరిపూర్ణానంద చాలా వేగంగా రాజకీయాలు ఒంటబట్టించుకున్నారు. ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అంతేకాదు... తెలంగాణలో 70 సీట్లు గెల్చి ఎంఐఎం పార్టీ నేతల అంతు తేలుస్తాం అని సవాలు విసిరారు పరిపూర్ణానంద. వారి మెడలు ఒంచేది తామే అన్నారు. మెదక్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ లో తల దించుకుని తిరిగే రోజులు వస్తాయని ఆయన అన్నారు. అసలు బీజేపీకి గతంలో సీట్లన్నీ వస్తే అద్భుతం జరిగినట్టే అని విశ్లేషకులు చెబుతుంటే ఆ పార్టీ మాత్రం ఏకంగా కేసీఆర్‌ను మించిపోతాం అంటోంది.
ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. 2014కు ముందు నరేంద్రమోడీకి ఒవైసీ సోదరులు ఛాలెంజ్ చేశారు. హైదరాబాదులో నరేంద్రమోడీని కొడతాం అన్నారు. అంత దారుణంగా మాట్లాడినా.. ఏకంగా దేశ ప్రధాని అయినా ఒవైసీ సోదరుల మీద ఒక్క కేసు పెట్టలేని - నిరూపించలేని బీజేపీ నేతలు... రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినంత మాత్రాన సాధించేముంది అని జనం నిట్టూరుస్తున్నారు. దేశమే చేతుల్లో ఉండగా చేయలేని పని రాష్ట్రం ఉంటే చేస్తారా అన్నది జనం నిట్టూర్పు.