Begin typing your search above and press return to search.

ప‌రిపూర్ణానంద‌పై `షా`కింగ్ నిర్ణ‌యం!?

By:  Tupaki Desk   |   14 July 2018 10:32 AM GMT
ప‌రిపూర్ణానంద‌పై `షా`కింగ్ నిర్ణ‌యం!?
X
2014లో కేంద్రంలో బీజేపీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత దేశంలో అస‌హ‌నం పెరిగిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి తెలిసిందే. అదీగాక ఆర్ ఎస్ ఎస్ క‌నుస‌న్న‌ల్లో న‌డిచే బీజేపీలో యోగులు - పీఠాధిప‌తులు - మ‌ఠాధిప‌తులు - స్వామీజీలు ఎమ్మెల్యేలు - ఎంపీలుగా ఉండ‌డం పై కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌త్యేకించి యూపీకి యోగి ఆదిత్య‌నాథ్ సీఎం కావ‌డం విశేషం. గ‌తంలో మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎంగా ఉమాభార‌తి ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. ఇలా బీజేపీలో ఈ త‌రహా సంప్ర‌దాయం చాలాకాలంగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఉత్త‌రాది వ‌ర‌కే ప‌రిమిత‌మైన ఈ త‌ర‌హా `సంప్ర‌దాయ‌`రాజ‌కీయాల‌ను ....ద‌క్షిణాదికి వ్యాప్తి చేసేందుకు బీజేపీ నేత‌లు రెడీ అవుతున్నారు. తాజాగా, తెలంగాణలో ప‌ర్య‌టించిన అమిత్ షా ...ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారని పుకార్లు వ‌స్తున్నాయి. యూపీలో యోగి త‌ర‌హాలో....తెలంగాణ‌లో ప‌రిపూర్ణానంద స్వామిని రాబోయే ఎన్నిక‌ల బ‌రిలోకి దించేందుకు `షా`కింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం బీజేపీ త‌ర‌ఫున గెలిచిన స్వామీజీల్లో - సన్యాసినులు - మ‌ఠాధిప‌తుల్లో చాలామంది అతివాద భావాలతో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తుంటారు. త‌ర‌చూ త‌మ వ్యాఖ్య‌ల‌తో వివాదాలు రేప‌డం....వార్త‌ల్లో నిల‌వ‌డం వారికి ప‌రిపాటి. సాధ్వీ రితంభరి వంటివారికి హిందూ తీవ్రవాదంతో సంబంధాలున్నాయనే ఆరోపణలున్న సంగ‌తి తెలిసిందే. ఈనేప‌థ్యంలో ఉత్త‌రాది త‌ర‌హాలోనే ద‌క్షిణాదిలో కూడా బీజేపీని స్వాముల‌తో బ‌లోపేతం చేయాల‌ని షా ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీని బ‌లోపేతం చేసేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పరిపూర్ణానందను లోక్ స‌భ బ‌రిలో దించాల‌ని భావిస్తున్నార‌ట‌. ఆర్ ఎస్ ఎస్‌ నేపథ్యమున్న పరిపూర్ణానంద ...హిందూ మ‌త ప్ర‌చార‌కుడిగా బాగా పాపుల‌ర్ కావ‌డం....హిందూ మతం పరిరక్షణ కోసం పోరాటాలు చేయ‌డం....షాను ఆక‌ట్టుకున్నాయ‌ట‌. ఆ క్ర‌మంలోనే ప‌లు టీవీ షోల‌లో ప‌రిపూర్ణానంద పాల్గొన‌డం....ఏకంగా ఓ `భ‌క్తి` టీవీ చానెల్ ను ర‌న్ చేయ‌డం...వంటి విష‌యాల‌పై షా చ‌ర్చించార‌ట‌. దాంతోపాటు కత్తి మహేష్ వ్య‌వ‌హారంలో న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ అంశాలు కూడా చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ట‌. ఈ నేప‌థ్యంలో....ప‌రిపూర్ణానంద‌ను కరీంనగర్‌ నుంచి లోక్‌సభ బ‌రిలో దించాల‌న్న షా ప్ర‌పోజ‌ల్ కు పార్టీ నేత‌లు కూడా సానుకూలంగా స్పందించారట‌. అయితే, త‌న‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉంద‌ని గ‌తంలో ప‌రిపూర్ణానంద ప‌లుమార్లు చెప్పిన సంగ‌తి తెలిసిందే.