Begin typing your search above and press return to search.

ఆ పీఠాధిప‌తి ఆశ్ర‌మాన్ని కాల్చేశారు!

By:  Tupaki Desk   |   27 Oct 2018 9:54 AM GMT
ఆ పీఠాధిప‌తి ఆశ్ర‌మాన్ని కాల్చేశారు!
X
శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోవ‌టానికి మ‌హిళ‌ల్ని అనుమ‌తిస్తూ సుప్రీం వెలువ‌డించిన తీర్పుపై లక్ష‌లాది మంది తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. శ‌తాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్ ను ఎందుకు దెబ్బ తీయాలంటూ ప్ర‌శ్నిస్తున్న వారు పెద్ద ఎత్తున నిర‌స‌న ఆందోళ‌న‌లు చేప్ట‌టారు.

అదే స‌మ‌యంలో సుప్రీం తీర్పును ఏదోలా అమ‌లు చేయాల‌న్న అత్యుత్సాహంతో కేర‌ళ స‌ర్కార్ అనుస‌రించిన వైనంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అయ్య‌ప్ప ద‌ర్శ‌నం కోసం వంద‌మంది సాయుధులైన పోలీసుల ప‌హ‌రాలో ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని కొండ పైకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేసిన బ‌ల‌గాల‌కు స్వామి భ‌క్తుల నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ్యక్త‌మైంది. త‌మ‌కున్న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ మ‌హిళ‌ల ద‌ర్శ‌నం కోసం భ‌ద్ర‌తా ద‌ళాలు అలా చేయొచ్చా? అన్న వాద‌న‌లు వినిపించాయి.

ఇదిలా ఉంటే.. శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప గుడిని మ‌హిళ‌లు కూడా ద‌ర్శించుకోవాల‌న్న సుప్రీం కోర్టు తీర్పుపై సానుకూలంగా స్పందించిన పీఠాధిప‌తి ఆశ్ర‌మాన్ని తాజాగా గుర్తు తెలియ‌ని దుండ‌గులు ద‌గ్థం చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

తిరువ‌నంత‌పురం స‌మీపంలోని స్వామి సందీపానంద బాలిక‌ల పాఠ‌శాల ముందు పార్క్ చేసిన రెండు కార్లు.. స్కూట‌ర్ల‌కు నిప్పు పెట్టారు. శ‌నివారం తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల వేళ‌లో చోటు చేసుకున్న ఈ అగ్ని ప్ర‌మాదంలో స్వామీజీ ఆశ్ర‌మం పూర్తిగా ద‌గ్థ‌మైంద‌ని చెబుతున్నారు. సిద్దాంత ప‌రంగా ఒక‌రిని ఎదుర్కోవాలే త‌ప్పించి ఇలా పిరికిపంద‌ల్లా భౌతిక దాడుల‌కు దిగ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించారు. దీనికి కార‌ణ‌మైన వారిని అదుపులోకి తీసుకుంటామ‌ని.. క‌ఠినంగా శిక్షిస్తామ‌ని కేర‌ళ సీఎం హెచ్చ‌రిస్తున్నారు.