Begin typing your search above and press return to search.
మోడీ ఓటమికి కేసీఆర్ పై కేసుకు కారణం అదేనా?
By: Tupaki Desk | 17 Nov 2015 9:18 AM GMTసంచలన వ్యాఖ్యలు చేసే విశాఖపట్నం శారదా పీఠం స్వామీజి స్వరూపానందేంద్ర మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి కేంద్రంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో ముగ్గురు పాలకులను భయపెడుతున్నారు. అమరావతి శంకు స్థాపన కార్యక్రమ ముహూర్తం బాగులేదని మొదటినుంచి చెబుతున్న ఆయన మరోసారి అదే అంశాన్ని ఎత్తుకున్నారు. అంతేకాదు... మంచి ముహూర్తం కాకపోవడం వల్లే ఆ కార్యక్రమానికి వచ్చినవారంతా ఏదో ఒక ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించి ఉదాహరణలు చెప్పడంతో వారంతా ఆలోచనలో పడాల్సి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందని... అందుకు కారణం అమరావతి ముహూర్తం బాగులేకపోవమేనని స్వరూపానంద చెబుతున్నారు. అమరావతి మూహుర్తం బాగోలేదని అంటున్నా కార్యక్రమం అద్భుతంగా జరిగిందంటున్నవారికి సమాధానంగా ఆయన పలు ఉదాహరణలు చెబుతున్నారు. ప్రధాని మోడీ అమరావతి వచ్చి వెళ్లాక బీహారు ఎన్నికలలో ఓడిపోయారని.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సీబీఐ కేసు బయటకు వచ్చింది కూడా ఆయన అమరావతి వచ్చి వెళ్లాకేనని చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపైనా ప్రజలలో వ్యతిరేకత వస్తోందని అన్న స్వరూపానంద బాక్సైట్ తవ్వకాలకు అనుమతిని కూడా వ్యతిరేకించారు.
అయితే.... ఇవన్నీ విన్న విలేకరులు అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం అందనందుకే ఇలా మాట్లాడుతున్నారా అని అడగడంతో స్వరూపానంద కాసేపు తత్తరపడినా వెంటనే సర్దుకున్నారు. ఆంద్రప్రదేశ్ కు రాజధాని అయిన అమరావతికి తాను ఎప్పుడైనా వెళ్లగలనని... అది అందరిదీ అని చెప్పారు. గాంధీ - గాడ్సేలలో ఎవరిని అబిమానిస్తారంటే ఇద్దరినీ అంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారాయన.