Begin typing your search above and press return to search.
బాబుపై పవన్ చేయలేని పని స్వామిజీ చేస్తారట
By: Tupaki Desk | 8 May 2017 4:51 AM GMTజనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడే సందర్భం ఇది. రాజకీయాల్లో ఉండి, సిద్దాంతాలను అనుసరిస్తూ అందుకోసం గళం విప్పుతున్న పవన్ కీలకమైన విషయంలో గమ్మున ఉండిపోతే అదే విషయంలో ఓ స్వామి గొంతెత్తారు. తెలుగువారికి జరుగుతున్న అన్యాయంపై నిరసన మొదలుపెట్టారు. అవసరమైతే కోర్టుకు వెళతానని ప్రకటించారు. ఇదంతా టీటీడీ ఈఓ నియామకం గురింది. తెలుగు రాష్ర్టాలకు చెందిన ఐఏఎస్ లకు పక్కనపెట్టి ఉత్తరాదికి చెందిన సింఘాల్ ను ఈఓగా నియమించడం గురించి. ఇంతకీ ఆ స్వామీజీ ఎవరంటే స్వామి స్వరూపానంద సరస్వతి.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కొత్త ఈవోగా ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నియమితులైన విషయం తెలిసిందే. దీనిపై స్వామి స్వరూపానంద సరస్వతి విలేకరులతో మాట్లాడుతూ టీటీడీ ఈఓగా ఉత్తరాది వారిని నియమించడం దురదృష్టకరమని మండిపడ్డారు. తెలుగు చదవడం - మాట్లాడటం రానివారిని ఎలా ఈఓగా ప్రభుత్వం నియమిస్తుందని ప్రశ్నించారు. తెలుగువారిని వదిలి బయటివారికి ఈఓ పోస్టు కట్టబెడుతూ టీడీపీ ప్రభుత్వం చేసిన దుస్సాహసం ఎవ్వరూ చేయలేదన్నారు. ఉత్తర ప్రాంతం ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందని స్వామిజీ తెలిపారు. కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆగమానికి సంబంధించి సమస్యలు వస్తాయని వివరించారు. మాజీ ఈఓ సాంబశివరావు నిజాయితీగలవారని, అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. సాంబశివరావును మార్చడం పనికిమాలిన ఆలోచన అని స్వరూపానంద మండిపడ్డారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఇది పరాకాష్ఠ అని స్వామి విమర్శించారు. టీటీడీ నూతన ఈఓ నియామకంపై కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. ఇక ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి చర్యలు తీసుకోకుండా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
స్వరూపానంద స్వామి ఇంత స్పష్టంగా ఉత్తరాది-దక్షిణాది అంటూ తెలుగువారికి జరుగుతున్న అన్యాయంపై స్పందిస్తుంటే ఆఖరికి న్యాయం పోరాటం కూడా చేస్తానని ప్రకటించేస్తుంటే... అన్యాయంపై గళం విప్పుతాను, ప్రశ్నిస్తాను అని ప్రకటించిన పవర్ స్టార్ ఇప్పుడు ఉత్తరాది వారికి అగ్రపీఠం వేయడం ఏపీ సీఎం చంద్రబాబు తీరును తప్పుపట్టకపోవడం ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/