Begin typing your search above and press return to search.

భయటపడిన మరో దొంగ బాబా .. 20 ఏళ్ల అమ్మాయితో ...!

By:  Tupaki Desk   |   28 Feb 2020 6:15 AM GMT
భయటపడిన మరో దొంగ బాబా .. 20 ఏళ్ల అమ్మాయితో ...!
X
ఈ మధ్య రోజుల్లో సందుకోకరు , పుట్టకొకరు దొంగబాబాలు పుట్టుకొస్తున్నారు. మోసపోయేవారు ఉన్నంత కాలం , మోసం చేసేవారు ఉంటారు అని చూపినట్టు ఈ బాబాలని నమ్మే పిచ్చి జనాలు ఉన్నన్ని రోజులు దొంగబాబాల జీవితానికి ఎటువంటి లోటులేదు. నిత్యం టీవీలలో, పేపర్ లలో దొంగ బాబాల గురించి చూస్తూ , చదువుతున్నా కూడా మళ్ళీ ఎవరో కాషాయం డ్రెస్ వేసుకొని, చేతిలో రుద్రాక్ష మాల పట్టుకోగానే ...బాబా అంటూ అయన పదలవద్ద వాలిపోతున్నారు. నిత్యానంద, డేరా బాబా లాంటి వారిని చూసిన తరువాత కూడా ..బాబాలని నమ్ముతున్నారు ఆంటే మన దేశంలో బాబాలకి ఎంత వాల్యూవ్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే , తాజాగా మరో డేరా బాబా బాగోతం బయటపడింది.

బాబా అంటే .. భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ , సన్యాసి జీవితం గడుపుతుండాలి. కానీ , ఈ బాబాకి మాత్రం సన్యాసి జీవితం మీద విరక్తి పుట్టి ..సంసారం జీవితం పై ఆశ కలిగినట్టు ఉంది. రోజూ తన పాదపూజ చేసుకునే 20ఏళ్ల భక్తురాలిపై మనసు పారేసుకుని ఆమెతో కలిసి జంప్ అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ ప్రజలు ..బాబాలో భక్తి ఒక్కటే కాదు, రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా హోళలి గ్రామంలో జరిగింది.

ఉత్తర కర్ణాటకలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్‌ కు చెందిన దత్తాత్రేయ అవధూత రెండు నెలల కిందటే హొళలి గ్రామానికి వచ్చాడు. కాషాయం ధరించి, కమండలం చేతపట్టి, తన వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకున్నాడు. గ్రామంలోని భీమలింగేశ్వర ఆలయంలో పూజారిగా ఉంటానని గ్రామస్థులకు చెప్పి ఒప్పించాడు. తాను భగవంతుడి స్వరూపుడినని, త్వరలోనే అక్కడ ఓ ఆశ్రమాన్ని స్థాపించి గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని బాగా నమ్మబలికాడు, ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలో జాతరను భారీస్థాయిలో నిర్వహించాడు. దీంతో ప్రజలు తమ గ్రామానికి మంచి స్వామీజీ వచ్చాడని సంబరపడుతున్న సమయంలోనే అందరికీ దిమ్మతిరిగే షాకిచ్చాడు.

అయితే , హోళలి గ్రామానికే చెందిన యువతి శివరాత్రి రోజు స్వామీజీకి పాదపూజ చేసి వస్తానని వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీనితో ఆందోళన పడిన కుటుంబసభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. అదే సమయంలో స్వామీజీ కూడా కనిపించడం లేదని తెలియడంతో అంతా షాకయ్యారు. స్వామీజీ ఆ యువతిని తీసుకుని వెళ్తుండగా తాము చూశాడని కొందరు స్థానికులు చెప్పడంతో తల్లిదండ్రులతో పాటు, గ్రామస్థులు కూడా షాకయ్యారు. ఆ యువతి రోజూ మఠానికి వచ్చేదని, ఈ క్రమంలోనే స్వామీజీ ఆమెను లోబరుచుకుని వెంట తీసుకెళ్లాడని తెలుసుకున్నారు. దీంతో యువతి తల్లిదండ్రులు స్వామీజీపై కోలారు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి సోదరుడు కూడా అదే మఠంలో కొన్నాళ్లుగా స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్నాడు. రెండ్రోజుల క్రితం అతడికి ఫోన్ చేసి స్వామీజీ ఆమెను తిరుపతిలో పెళ్లి చేసుకున్నానని, రెండు మూడు రోజుల్లో తిరిగొస్తామని చెప్పాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కోలార్ జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. స్వామీజీ ఆచూకీ తెలుసుకునేందుకు స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు.