Begin typing your search above and press return to search.

చౌకమద్యం పేరు మార్చి చెబితే...

By:  Tupaki Desk   |   28 Aug 2015 4:26 AM GMT
చౌకమద్యం పేరు మార్చి చెబితే...
X
ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్నవిషయం చౌక మద్యం! దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అసలు మధ్యమే మహమ్మారి అయితే... ఇందులో మరలా చౌక, ఖరీదు అనే ప్రస్థావన ఎందుకు? ఎని ఒక వర్గం భావిస్తుంటే... ఈ చౌక మద్యం వచ్చిందే గుడుంబా అనే విషపదార్థం నుండి ప్రజలకు విముక్తి కలిగించడం కోసం కాబట్టి... చౌకమద్యం బెటర్ ఆప్షన్ అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే నెల మూడో తేదీన తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ఎక్సైజ్ ఆఫీసుల ముందు మహిళలతో ధర్నాలు చేస్తామని తెలంగాణ టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటిని అందించమంటే... మద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం అవిరామంగా కృషిచేస్తుందని ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు!

ఈ క్రమంలో మద్యం విధానాన్ని ఎన్ని రకాలుగా సమర్ధించుకోవాలో అన్ని రకాలుగానూ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తోంది టి.ప్రభుత్వం. చౌక మద్యం ఒక గొప్ప పథకమని, ప్రజలు కల్తీ కల్లు, గుడుంబాలు తాగి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్న తరుణంలో.. వారికి, వారి కుటుంబాలకు ఈ కొత్త మద్యం విదానం, చౌక మద్యం చాలా ప్రయోజనం అని చెప్పుకొస్తున్నారు. ఇదే క్రమంలో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కూడా గొంతు కలిపారు. నూతన మద్యం విధానం అద్భుతమని, ఈ విధానంలో ఉన్న మర్మాన్ని గ్రహించడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని సెలవిస్తున్నారు. గుడుంబా అనేది విషపదార్ధమని, అది పూర్తిగా కల్తీ సరుకని.. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న చౌక మద్యం ప్రభుత్వ కనుసన్నల్లో ఉత్పత్తి అవుతుంది కాబట్టి... కల్తీ అనే ఆలోచనే ఉండదని చెబుతున్నారు స్వామి గౌడ్! చౌక మద్యం అంటే చౌక ధరకు దొరికే మద్యమే తప్ప... చీప్ సరుకు కాదంటున్నారు. ఇదే క్రమంలో ప్రతిపక్షాలకు, ప్రజలకు అర్ధం అవ్వడానికి "చౌక మద్యం" బదులు వేరే పేరు పెడితే మంచిదని సూచిస్తునారు!