Begin typing your search above and press return to search.

అధికారం కొందరికే పరిమితం.. స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 Aug 2020 1:00 PM GMT
అధికారం కొందరికే పరిమితం.. స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు
X
గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ బయటపడ్డారు. ఒక్కసారిగా తెలంగాణలో కులరాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ అధిష్టానానికి వ్యతిరేకంగానే ఆయన కామెంట్ చేసినట్టు అర్థమవుతోంది.

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వామిగౌడ్ తాజాగా మాట్లాడుతూ.. తెలంగాణలో కొన్ని కులాలే పరిపాలన.. ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయన్నారు. అధికారం కొంతమందికే పరిమితమైందన్నారు. కుల ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతున్నాయని.. కొన్ని కులాల వారు మాత్రమే పరిపాలనలో ఉండి ప్రజలను పాలిస్తున్నారని.. బీసీలను ముందుకు తీసుకెళ్లాలని స్వామి గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కులరక్కసితో బీసీలకు అన్యాయం జరుగుతోందని స్వామి గౌడ్ అన్నారు.

కాగా మండలి చైర్మన్ పదవి నుంచి తొలిగినప్పటి నుంచి స్వామి గౌడ్ టీఆర్ఎస్ లో యాక్టివ్ గా లేరు.కేసీఆర్ ఆయనకు పదవిని రెన్యువల్ చేయలేదు. ఈ క్రమంలోనే స్వామి గౌడ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని స్వామి గౌడ్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఆవేదనను ఇలా బయటపెడుతున్నాడని అర్థమవుతోందని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.