Begin typing your search above and press return to search.
మోడీపై స్వామి నమ్మకం...పాక్ అద్దె ధైర్యం!
By: Tupaki Desk | 23 Sep 2016 4:14 AM GMTఉరీ సైనిక శిబిరంపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే ఈ విషయంపై పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండగా.. భారత్ కూడా తగిన స్థాయిలో కౌటర్స్ ఇస్తూనే ఉంది. ఈ విషయంలో త్వరలో యుద్దం జరగబోతుందనే ఊహాగానాలు వినిపిస్తుంటే... సైనిక చర్య కాదు - దౌత్యపరమైన చర్య ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వం కొట్టబోయే దెబ్బతో పాకిస్థాన్ ఇక కోలుకోలేదని చెబుతూ... ఆ నిర్ణయం ఏమిటనే విషయాలపై మాత్రం సస్పెన్స్ కొనసాగించారు.
త్వరలో మోడీ కొట్టబోయే దెబ్బతో పాకిస్థాన్ కోలుకోవడం ఇక జరిగేపని కాదని, అది చాలా కష్టమని వ్యాఖ్యానించిన సుబ్రహ్మణ్య స్వామి... పాక్ పై భారత్ నేరుగా దాడి చేస్తుందా? ఒక వేళ చేస్తే అది ఏ తరహా దాడి? పాక్షిక యుద్ధమా లేక సంప్రదాయక యుద్ధమా? సైనిక చర్యే అయితే... పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తుందా.. లేక లాహోర్ దాకా దూసుకెళ్తుందా? వంటి మొదలైన ప్రశ్నలు మిగిల్చిన స్వామి... వీటన్నంటికీ అతి త్వరలోనే సమాధానం దొరుకుతుందని వ్యాఖ్యానించారు.
ఉరీ సైనిక శిబిరంపై ఉగ్ర దాడి - అనంతర పరిణామాల నేపథ్యంలో భారత్ - పాక్ మరో యుద్ధం జరపచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో... పాకిస్థాన్ కు చెందిన రక్షణ మంత్రి ఖవాజా ఎం ఆసిఫ్ - తమ వైమానిక దళం కూడా యుద్ధానికి సిద్ధంగా ఉంది అన్నట్లు ఒక ట్వీట్ చేశారు. లేని దైర్యాన్ని తెచ్చుకునే క్రమమో లేక భారత్ ను బెదిరించాలనే ప్రయత్నమో కానీ... ఈ ట్వీట్ లో ఆయన కొన్ని యుద్ద విమానాల ఫోటోలు షేర్ చేశారు. ఇదే క్రమంలో ఆ దేశానికే చెందిన జర్నలిస్ట్ ఒమర్ ఈ ట్వీట్ లో తప్పును వెలికితీసే క్రమంలో ఆ రక్షణ మంత్రి గాలి తీసేశారు. పాక్ రక్షణ మంత్రి పోస్ట్ చేసిన యుద్ధ విమాన చిత్రాలు పాక్ వి కాదని - దక్షిణ కొరియాలో అమెరికా నిర్వహించిన విన్యాసాలకు సంబందించినవి అని చెబుతూ ఆ వివరాలను రీట్వీట్ చేశారు. దీంతో పాక్ రక్షణమంత్రికి తమ దేశానికి చెందిన జర్నలిస్ట్ నుంచే బలమైన షాక్ తగిలింది.