Begin typing your search above and press return to search.
టీటీడీ కేసుపై స్వామి విజయం సాధించారా? ఆంధ్రజ్యోతి ఏం చెబుతోంది?
By: Tupaki Desk | 30 Sep 2021 7:43 AM GMTఫైర్ బ్రాండ్ కమ్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి వర్సెస్ ఆంధ్రజ్యోతి మధ్యనున్న కేసు ఒకటి ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే చాలానే చర్చ జరిగింది. ఏదైనా కేసు టేకప్ చేస్తే.. తాను టార్గెట్ చేసిన వారికి చుక్కలు చూపించే తత్త్వం స్వామికి ఎక్కువన్న పేరు. దీంతో.. టీటీడీ కేసు విషయంలో ప్రముఖ మీడియాసంస్థ ఆంధ్రజ్యోతికి ఇబ్బందులు ఎదురుకానున్నాయా? అన్నది ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ కేసుకు సంబంధించి సుబ్రమణ్య స్వామి చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో.. స్వామి ట్వీట్ కు కౌంటర్ ఇచ్చేలా ఆంధ్రజ్యోతి తన వాదనను వినిపించటం గమనార్హం.
ఇంతకూ స్వామి ఏం చెప్పారు? ఆంధ్రజ్యోతి ఏం చెప్పిందన్న దానికి ముందుగా.. అసలు ఈ వివాదంలోకి వెళితే..
టీటీడీకి సంబంధించి 2019లో ఆంధ్రజ్యోతిలో ఒక వార్త పబ్లిష్ అయ్యింది. టీటీడీ పంచాంగం కోసం వెబ్ సైట్ లో వెతికినప్పుడు అన్యమత పదం కనిపించిందని.. దానికి సంబంధించిన ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి పబ్లిష్ చేయటం.. అది కాస్తా సంచలనంగా మారింది. దీనిపై టీటీడీ విజిలెన్స్ విశాగం ఫిర్యాదు చేసింది.దీంతో.. తిరుపతి పోలీసు కేసు నమోదు చేశారు.
అనూహ్యంగా ఈ ఎపిసోడ్ లోకి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి ఎంటర్ అయ్యారు. ఈ కేసు దర్యాప్తు వేగంగా సాగటం లేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనికి సంబంధించిన విచారణ తాజాగా జరిగింది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటు దాఖలు చేశామని కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూపకుమార్ గో స్వామి.. జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం చట్ట నిబంధన మేరకు సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
ఇదిలా ఉండగా.. ఈ పరిణామంపై సుబ్రమణ్య స్వామి ఒక ట్వీట్ చేశారు. ఇందులో.. ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం.. టీటీడీ ఫిర్యాదు.. తాను దాఖలు చేసిన పిల్ పై హైకోర్టులో విజయం సాధించినట్లుగా పేర్కొన్నారు. హైకోర్టు.. విచారణను పూర్తి చేయాలని మాత్రమే పేర్కొంది తప్పించి.. ఎవరు తప్పు చేశారన్న విషయాన్ని ఇంకా తేల్చలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఇదిలా ఉంటే.. సుబ్రమణ్య స్వామి ట్వీట్ మీద ఆంధ్రజ్యోతి కూడా తనదైనశైలిలో స్పందించింది. స్వామి చేసిన తప్పును ప్రస్తావించి.. ఆయన చేసిన ట్వీట్ లో అర్థం లేదన్నట్లుగా పేర్కొంది. తమ కథనం.. వెబ్ సైట్ లో అన్యమతం పదం గురించి అయితే.. స్వామి మాత్రం.. టీటీడీ బోర్డుకార్యాలయంలో అన్యమతానికి సంబంధించిన క్యాలెండర్ వేలాడదీశారన్నకథనాన్ని పబ్లిష్ చేసిందని పేర్కొనటాన్ని తప్పు పట్టింది. స్వామి సొంత అభిప్రాయాల్ని ట్వీట్ లో ప్రస్తావించారే కానీ.. ఆయన చెప్పిన మాటలేవీ ఆంధ్రజ్యోతిలోని కథనంలో పబ్లిష్ కాలేదన్న మాటను చెప్పింది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఈ ఇష్యూ మరింత ముదరటం ఖాయమన్న అభిప్రాయాన్నిపలువురు వ్యక్తం చేస్తున్నారు.