Begin typing your search above and press return to search.
స్వర్ణప్యాలెస్ కేసు : డా. రమేష్ విచారణకు హైకోర్టు అనుమతి !
By: Tupaki Desk | 27 Nov 2020 4:05 PM GMTఏపీలో కరోనా వైరస్ మహమ్మారి బీభత్సం కొనసాగుతున్న సమయంలో విజయవాడ లో జరిగిన ఓ ఘటన తో దేశం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అదే విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాదం. విజయవాడ స్వర్ణప్యాలెస్ లో నిర్వహిస్తున్న కరోనా క్వారంటైన్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది రోగులు మృతి చెందారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ ఘటన కి సంబంధించిన కేసు లో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చిన రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్‌ను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారించకుండా గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వర్ణప్యాలెస్ లో నిర్లక్ష్యంగా కరోనా సెంటర్ నడిపి 10 మంది చావుకు కారణమయ్యారన్న ఆరోపణలపై డాక్టర్ రమేష్‌ను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకూ మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఆయన్ని న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ నిర్వహించాలని కూడా హైకోర్టు సూచించింది.
స్వర్ణప్యాలెస్ లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో డాక్టర్ రమేష్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతుండగా, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు దర్యాప్తుతో పాటు ఆయన అరెస్టుపైనా స్టే విధించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దర్యాప్తును ఎలా అడ్డుకుంటారని హైకోర్టును ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగించుకోవచ్చని, కానీ రమేష్ ను పోలీసు స్టేషన్ కు పిలిపించి విచారణ చేయొద్దని ఆదేశాలు జారీచేసింది.
ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది కరోనాతో బాధితులు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగిందని అధికారులు నివేదకి సమర్పించారు. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.