Begin typing your search above and press return to search.

ఆ సాములోరు కేసీఆర్ ను అంతలా పొగిడారు?

By:  Tupaki Desk   |   18 Nov 2016 6:44 AM GMT
ఆ సాములోరు కేసీఆర్ ను అంతలా పొగిడారు?
X
సాములోరు ఆచితూచి మాట్లాడతారన్న పేరుంది. తొందరపడి ఒక మాట ఎక్కువ తక్కువ మాట్లాడటం ఉండదు. ఇంకా చెప్పాలంటే సన్యాసులుగా.. భావోద్వేగాలకు చాలా దూరంగా వారు ఉంటారని చెబుతారు. అందుకు భిన్నంగా కొందరు సాముల మాటలు ఉంటున్నాయి. తాజాగా శారదా పీఠాధీశ్వరులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చేసిన వ్యాఖ్యలు వింటే విస్మయం రేకెత్తించక మానదు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి భూమండటంలోనే లేరని ఆయన పొగిడేశారు. వరంగల్ భద్రకాళి దేవాలయాన్ని సందర్శించిన ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వాములోరు పరిపరి విధాలుగా పొగిడేశారు. ఆయన్ను గొప్ప దార్శనికుడిగా.. అధ్యాత్మికవేత్తగా అభివర్ణించారు.

స్వాములోరి పొగడ్తతో కేసీఆర్ విపరీతంగా అభిమానించే వీరాభిమానులు సైతం షాక్ తిన్నారనే చెప్పాలి. ఒక రాజకీయ నేతను ఒక స్వాములోరు ఈ స్థాయిలో పొగిడేయటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మనలో మన మాట.. ఇంతకూ తెలంగాణ ముఖ్యమంత్రిని స్వాములోరు అంతలా ఎందుకు పొగిడేశారంటారు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/