Begin typing your search above and press return to search.
జగన్ గెలుపు వెనుక ఆ స్వామీజీ ఆశీస్సులు!
By: Tupaki Desk | 24 May 2019 6:45 AM GMTఅందరూ జగన్ గెలుపు గురించే మాట్లాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం జగన్ గెలుపునకు దారి తీసిన అంశాల మీద ఫోకస్ చేస్తే.. చాలా తక్కువమంది మాత్రమే జగన్ గెలుపు వెనుక కీలకంగా పని చేసిన వారిని గుర్తించే పని మొదలు పెట్టటమే కాదు.. వారేం చేశారు.. వారి ప్రభావం ఎంతన్న విషయం మీద ఆరాలు తీయటం మొదలు పెట్టినట్లుగా చెప్పాలి.
వాస్తవానికి ఈ పని ముందే మొదలెట్టాలి. జగన్ గెలుపునకు ఉన్న అవకాశాల్ని గుర్తించి.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. కానీ.. టీడీపీ ఈ విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. జగన్ గెలుపు వెనుక ప్రశాంత్ కిశోర్ లాంటోళ్లు పని చేసినా.. అందరి దృష్టిలో పెద్దగా పడని వ్యవహారం ఒకటి ఉందంటున్నారు. ఎన్నికల్లో జగన్ విజయం కోసం ప్రత్యేకంగా యాగాన్ని చేసిన విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పాత్ర చాలా ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
2014 ఎన్నికల్లో జగన్ ఓడిన తర్వాత.. ఆయన అధికారంలోకి వచ్చేందుకు ఏం చేస్తే మంచిదన్న విషయాన్ని స్వామీజీని జగన్ సన్నిహితులు అడగటం.. దానికి ఆయన కొన్ని యాగాలు చేయాలని చెప్పినట్లుగా చెబుతారు. దీనికి మొదట్లో జగన్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించనప్పటికీ.. కొందరు సన్నిహితులు చేసిన సూచనతో ఓకే చెప్పినట్లుగా సమాచారం.
స్వరూపానంద స్వామీజీని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నమ్మకం ఉండటం.. ఆయన మాటల్ని తూచా తప్పకుండా పాటించే నేపథ్యంలో జగన్ కూడా ఓకే చెప్పటం తెలిసిందే. తాజా గెలుపు వెనుక స్వామీజీ సాయం చాలానే ఉందన్న అభిప్రాయాన్ని జగన్ తన సన్నిహితుల వద్ద వెల్లడించినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్వరూపానంద స్వామీజీ ఇప్పుడు పవర్ ఫుల్ స్వామీజీ అవుతారనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.