Begin typing your search above and press return to search.

కరెన్సీ లేకున్నా బతికేయొచ్చు

By:  Tupaki Desk   |   16 Nov 2016 10:30 PM GMT
కరెన్సీ లేకున్నా బతికేయొచ్చు
X
నోట్ల రద్దుతో క్యాష్ లెస్ లైఫ్ అవసరం పెరిగింది. కానీ... ఆ అలవాటు - అనుభవం మాత్రం జనానికి తక్కువే. ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే క్యాష్ లెస్ లైఫ్ ని లీడ్ చేస్తూ దాని ప్రయోజనాలు పొందుతున్నాయి. ముఖ్యంగా స్వీడన్ ఇందులో ముందు వరుసలో ఉంది.

- స్వీడన్ లో చర్చికి ఇచ్చే విరాళాలు కూడా ఆన్ లైన్లోనే ఇస్తారు. అక్కడ మొత్తం లావాదేవీల్లో కేవలం 2 శాతం మాత్రమే నగదు ఉంటోంది. మిగతా అంతా ఆన్ లైన్ పేమెంట్లే.

- స్వీడన్లో ఏటీఎంలు కూడా చాలా తక్కువ. డబ్బులు తీసే అవసరం తక్కువ కావడంతో వాటి అవసరం కూడా తక్కువే.

- 2020 నాటికి ఆ రెండు శాతం కూడా నగదు లేకుండా 99.75 శాతం ఆన్ లైన్ ట్రాంజాక్షన్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

- అక్కడ అన్ని బ్యాంకులకు కలిపి ఒకటే యాప్ ఉంటుంది. దాని పేరు స్విస్. దాని సహాయంతో సెకన్లలో చెల్లింపులు, నగదు బదిలీ పూర్తి చేయొచ్చు.

- అయితే... ఆన్ లైన్ వ్యవస్థ ఇంత బలంగా ఉన్నా ఆర్థిక వ్యవస్థ మాత్రం మనకంటే తక్కువగానే ఉంది. స్వీడన్ కరెన్సీ క్రోనా కంటే మన రూపాయి విలువే ఎక్కువ.

- అంతేకాదు... ఒకప్పుడు స్వీడన్ దొంగతనాలకు పెట్టింది పేరు. అక్కడ బ్యాంకులు - ఇళ్లను కొల్లగొట్టి డబ్బు ఎత్తుకుపోయేవారు. కానీ... ఇప్పుడు క్యాష్ లెస్ కంట్రీగా మారాక దొంగతనాలు పూర్తిగా ఆగిపోయాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/