Begin typing your search above and press return to search.

ఆ దేశంలో మగ రేప్ బాదితుల కోసం ఆసుపత్రి

By:  Tupaki Desk   |   16 Oct 2015 3:51 AM GMT
ఆ దేశంలో మగ రేప్ బాదితుల కోసం ఆసుపత్రి
X
వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఎక్కడైనా ఆడవారి శీలాన్ని దోచుకున్నారని.. దారుణ అత్యాచారానికి గురైందంటూ చాలానే వార్తలు వినిపిస్తుంటాయి. కానీ.. యూరప్ లోని స్వీడన్ దేశం మాత్రం ఇందుకు కాస్త బిన్నం. ఈ దేశంలో మగమహారాజుల మీద అత్యాచార దారుణాలు పెరిగిపోతున్నాయట. అసలు మగాళ్లు రేప్ కు గురి అవుతారా? అన్న సందేహం అక్కర్లేదని.. ఆడవారి మీద మాదిరే మగాళ్ల మీదా అత్యాచారాలు సహజ పరిణామాలుగా సాగుతున్నాయని చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అత్యాచారానికి గురైన మగవారికి చికిత్స చేసేందుకు యూరప్ లోని స్వీడన్ లో ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. నానాటికీ పెరుగుతున్న అత్యాచార ఘటనల బాధితులకు సాయంగా ఉండేందుకు ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. స్వీడన్ లో అత్యాచారాలు పెరిగిపోతూ.. ‘‘రేప్ క్యాపిటల్ ఆఫ్ వెస్ట్’’ అన్న చెడ్డపేరును మూటగట్టుకుంటోంది. యూరప్ లోని దేశాలతో పోలిస్తే..స్వీడన్ లోనే ఈ అత్యాచార భూతం జడలు విప్పి భయపెడుతుందట.

ఒక్క 2013లోనే ఈ దేశంలో 17,700 రేప్ లు జరిగినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిజానికి అత్యాచారానికి గురై మగాళ్లు ఫిర్యాదు చేయటానికి జంకుతున్నారట. సామాజిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేయటానికి మగాళ్లు జంకుతున్నారట. ఈ పరిస్థితుల్లో బాధితులకు సాయం అందించేందుకు ఈ ఆసుపత్రి ఓపెన్ చేసినట్లుతగా చెబుతున్నారు.

స్వీడన్ లో ఓపెన్ చేసిన ఈ మగాళ్ల రేప్ ఆసుపత్ర పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా పని చేస్తందట. సహజంగా ఆడోళ్లు మాత్రమే రేప్ కి గురి అవుతారన్న అపప్రద ఉందని. ఇందులో నిజం లేదని.. రేప్ కి గురైన మగాళ్ల మానసిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. రేప్ కి గురైన మగాడు తాను అత్యాచారానికి గురయ్యారని చెప్పుకునేందుకు కూడా చాలామంది ఇష్టపడరని.. దీనికి సామాజిక కోణం కూడా కారణమన్న విశ్లేషణ చేస్తున్నారు. తాజాగా నెలకొల్పిన వసతులు అత్యాచారానికి గురైన పురుషలకు ఆసరాగా ఉంటాయన్న భావన వ్యక్తమవుతోంది.