Begin typing your search above and press return to search.
మద్యం హోం డెలివరీ స్టార్ట్.. పండుగ చేసుకోండి
By: Tupaki Desk | 22 May 2020 5:45 AM GMTమొన్నటి నిర్బంధం కారణంగా 40 రోజులుగా మద్యం దొరక్క మందు బాబులు ఎంత ఆగమయ్యారో చూశాం. ఇలా మద్యం షాపులు తెరవగానే కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టి అష్టకష్టాలు పడ్డారు.అయినా మద్యం దొరకని పరిస్థితి. ఇక ఇప్పుడు ఇంట్లోనే కాలుమీద కాలు వేసుకొని మద్యం తెప్పించుకునే రోజులు రాబోతున్నాయి.
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గి, జొమాటోలు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్రం ఓకే చెప్పింది. దీంతో ఇక క్యూలైన్ లో మద్యం కోసం నిలబడడానికి నామోషీగా ఫీలయ్యే వారు.. బిజీగా ఉండి ఇక మద్యం షాపుకు వెళ్లలేని వారికి ఈ రెండు సంస్థలు మద్యం హోం డెలివరీ చేస్తాయి. ఫుడ్ తోపాటు మద్యం ను కూడా డెలివరీ చేసేందుకు ఈ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
స్విగ్గీ, జొమాటోలు ఇక నుంచి మద్యం హోం డెలివరీ చేయనున్నాయి. ఈ మేరకు తొట్టతొలిగా జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇవాళ మద్యం హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించాయి. దీనికోసం యాప్ లో ‘వైన్ షాప్స్’ అనే ఆప్షన్ ను ప్రవేశపెట్టాయి.
ఇక 18 ఏళ్లలోపు వారు వయసు ధ్రవీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా కార్డుతో సెల్ఫీ దిగి అందులో పోస్టు చేయాలి. మైనర్లకు మద్యం అమ్మకుండా యాప్ లో మార్పులు చేశారు. ఓటీపీ ద్వారా మద్యం డెలివరీ చేస్తారు.
మద్యం కోసం క్యూలు కట్టడాలకు ఇక చెక్ పడనుంది... బడాబాబులు, అందరూ కూడా ఇంట్లోనే ఉండి మద్యం తెప్పించుకునే వీలు కలగనుంది.