Begin typing your search above and press return to search.
స్విమ్మింగ్ పూల్ లో మహిళలకు కొత్త రూల్!
By: Tupaki Desk | 14 Aug 2016 3:57 AM GMTఈ రోజుల్లో ఫిట్ నెస్ సేంటర్స్ లో స్విమ్మింగ్ ఫూల్ కూడా ఒక భాగం. అన్ని ఎక్సర్ సైజులతో పాటు స్విమ్మింగ్ చేయడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ విషయంలో మహిళలకు కండిషన్స్ పెట్టిన ఒక ఫిట్ నెస్ సెంటర్ వ్యవహారం సోషల్ మీడియాలోకి ఎక్కి సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై మహిళా లోకం నిరసన వ్యక్తం చేస్తుంది. ఇంతకూ మహిళా లోకానికి అంత కోపం రప్పించిన ఆ సంగతేమిటో ఇప్పుడు చూద్దాం.
జార్జియా దేశంలోని ఫోష్ ఫిట్ నెస్ సెంటర్ గా పేరొందిన వేకి స్విమ్మింగ్ పూల్ మహిళలకు కొత్త నిబంధన పెట్టింది. ఈ నిబంధనతో ఈ ఫిట్ నెస్ సెంటర్ అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. మహిళలు ప్రతినెలా పిరియడ్స్ సమయంలో స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్లరాదనేది ఈ కొత్త నిబంధన. ఈ మేరకు స్విమ్మింగ్ పూల్ లోని మహిళల డ్రెస్ ఛేంజింగ్ రూమ్ లో పోస్టరు అతికించారు. అనంతరం ఈ నిర్ణయాన్ని అమలుపరిచారు. ఇలా స్విమ్మింగ్ పూల్ లో వెలసిన పోస్టరు సోషల్ మీడియాలోకి ఎక్కి ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.
పిరియడ్స్ సమయంలో ప్రతినెలా ఐదురోజుల పాటు మహిళలు స్విమ్మింగ్ పూల్ లో దిగకుండా విధించిన ఈ నిషేధం పట్ల మహిళాలోకం నిరసన వ్యక్తం చేస్తోంది. పిరియడ్స్ సమయంలో వారి నుండి విడుదలయ్యే చెడు రక్తం స్విమ్మింగ్ పూల్ లో చేరి ఆ జలాలను కలుషితం చేస్తుందని.. అందుకే ఆ సమయంలో మహిళలు స్విమ్మింగ్ పూల్ లోకి దిగకుండా నిషేధం విధించామని పూల్ నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. మహిళలపై ఇలాంటి కొత్త నిబంధన పెట్టడంపై ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.