Begin typing your search above and press return to search.

హిల్లరీ బొమ్మను గోడ మీద అలా వేసేశారు

By:  Tupaki Desk   |   1 Aug 2016 3:30 PM GMT
హిల్లరీ బొమ్మను గోడ మీద అలా వేసేశారు
X
ఆగ్రరాజ్యాల్లో స్వేచ్ఛ ఎక్కువగా చెబుతుంటారు. దాని పేరు చెప్పుకొని కొందరు చేసే పనులు చాలా చిరాగ్గా ఉండటమే కాదు.. పలువురి మనోభావాలు దెబ్బ తినేలా ఉంటాయి. తాజాగా ఆస్ట్రేలియాలో అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల ప్రభావం ప్రపంచంలోనే అన్ని దేశాల మీద ఉన్నట్లే ఆస్ట్రేలియాలో కూడా ఎక్కువే. అక్కడి ఓ చిత్రకారుడికి ఏమైందో కానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల చిత్రాల్ని ఇష్టారాజ్యంగా గోడల మీద భారీ బొమ్మలు వేసేస్తున్నారు.

ఆ మధ్యన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్న మాజీ మోడల్ .. డోనాల్డ్ ట్రంప్ సతీమణి బొమ్మ అర్థనగ్న చిత్రాన్ని గోడ మీద వేసేశారు. ఆ తర్వాత డోనాల్డ్ ట్రంప్ కు చెందిన అభ్యంతరకర చిత్రాన్ని వేసేశాడు. అక్కడితో ఆగని అతగాడు తాజాగా డెమొక్రాట్ల అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్ బొమ్మను గోడ మీద భారీగా వేసేశాడు.

ఈ ఫోటో మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇంత దారుణంగా హిల్లరీ బొమ్మను ఎలా వేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్విమ్ సూట్లో ఉన్న ఆమె ఫోటోను అభ్యంతరకరంగా గోడ మీద పెయింట్ చేయటంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెల్ బోర్న్ శివారులోని ఫుల్ స్క్రే ప్రాంతంలో లష సక్స్ అనే పెయింటర్ ఈ బొమ్మల్ని వేశాడు. స్విమ్ సూట్లో డబ్బులు పెట్టుకున్నట్లుగా ఉన్న హిల్లరీ బొమ్మను గోడ మీద వేయటం ఆమెను అవమానించటంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బొమ్మపై వివాదం చెలరేగంతో స్థానిక మున్సిపల్ అధికారులు ఈ చిత్రాన్ని తొలగించాలని నిర్ణయించారు. అయితే.. సదరు పెయింటర్ మాత్రం.. కళకు ఆంక్షలేంటంటూ ఫీలవుతున్నారు. కళకు ఆంక్షలు ఉండవు కానీ.. బరితెగింపు కూడా ఉండకూడదని సదరు ‘కళా’కారుడికి తెలియకపోవటం ఏమిటో..?