Begin typing your search above and press return to search.

కరోనాతోపాటు స్వైన్ ఫ్లూ తరుముకొస్తోందా?

By:  Tupaki Desk   |   20 March 2020 11:30 PM GMT
కరోనాతోపాటు స్వైన్ ఫ్లూ తరుముకొస్తోందా?
X
ప్రపంచాన్ని అంటు వ్యాధులు గడగడలాడిస్తున్నాయి. కాలానికి అనుగుణంగా సోకే ఈ వ్యాధుల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2009లో గుర్తించిన స్వైన్ ఫ్లూ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చనిపోయారు. జనవరి-మార్చి - జూలై-సెప్టెంబర్ ల మధ్య చలి వాతావరణంలోనే ఈ వైరస్ విజృంభిస్తుంటాయి.

తాజాగా కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. 10వేల మందికి పైగా మరణించగా.. 2లక్షలకు పైగా జనాలకు ఈ అంటు వ్యాధి సోకి అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకీడుస్తున్నారు.

కరోనాతోపాటు స్వైన్ ఫ్లూ విస్తృతి కూడా బాగా పెరుగుతోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది 2019లో భారత్ లో ఈ కేసులు రెట్టింపు కావడం విశేషం.

ఈ ఏడాది మార్చి వరకు దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు 1100 దాఖలయ్యాయి. 28మంది మరణించారు. ఈ స్వైన్ ఫ్లూ కారణంగానే ఫిబ్రవరి నెలలో జర్మనీకి చెందిన కంపెనీ స్వాప్ భారత్ లో తన యూనిట్ ను మూసివేసింది. బెంగళూరులోని ప్రధాన కార్యాలయంలో ఇద్దరికి వైరస్ సోకడంతో వర్క్ ఫ్రం ఇచ్చేసింది.

ఇక యూపీలో 78 కేసులు నమోదు కాగా.. 9మంది పోలీసులు మరణించారు. సుప్రీం కోర్టు ఆరుగురు జడ్జీలకు కూడా ఈ వైరస్ సోకడం కలకలం రేపింది.

అందరూ కరోనా కారణంగా భయపడుతుంటే స్వైన్ ఫ్లూ కూడా చాపకింద నీరులా విస్తరిస్తుండడం దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కూడా తాజాగా స్వైన్ ఫ్లూ పై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. జాగ్రత్తలు పాటించాలని సూచించింది.