Begin typing your search above and press return to search.
స్విస్ డేటా వచ్చింది.... మోదీ చర్యలే మిగిలాయి
By: Tupaki Desk | 8 Sep 2019 4:54 PM GMTనల్ల కుబేరుల తాట తీస్తామంటూ 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారీ ప్రకటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి నిజంగానే ఇప్పుడు అసలు సిసలు పరీక్ష మొదలైందని చెప్పక తప్పదు. మన దేశంలో పోగేసిన అక్రమ సంపాదనను గుట్టు చప్పుడు కాకుండా స్విస్ బ్యాంకులకు తరలించిన ఘనాపాటీలు లెక్కలేనంత మంది ఉన్నారని చాలా కాలం నుంచి వినిపిస్తోంది. స్విస్ బ్యాంకుల నుంచి సమాచారం లేని కారణంగా వీరిపై చర్యలు తీసుకోలేకపోతున్నామని ఇప్పటిదాకా చెప్పుకుంటూ వస్తున్న మన పాలకులకు ఇకపై ఆ మాట చెప్పేందుకు అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే... అలాంటి చాలా సమాచారాన్ని స్విట్జర్లాండ్ దేశం మనకు అందజేసింది. మొదటి విడత సమాచారమే అయినా కూడా చాలా కీలక సమాచారాన్ని ఆ దేశ అధికారులు మనకు అందించేశారు. ఇకపై క్రమం తప్పకుండా ఏటా ఈ తరహా సమాచారం ఆ దేశం నుంచి మనకు అందుతూనే ఉంటుందట.
స్విట్జర్లాండ్ నుంచి సదరు కీలక సమాచారం వచ్చిన నేపథ్యంలో ఇక మన పాలకులు... ప్రత్యేకించి నల్ల కుబేరుల పనిబడతానంటూ ప్రతినబూనిన ప్రధాని నరేంద్ర మోదీ ఏ మేర చర్యలకు ఉపక్రమిస్తారన్న విషయమే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మనకు అందిన సమాచారంలో చాలా మంది నల్ల కుబేరుల పేర్లు ఉన్నాయట. మోదీ ప్రకటనలు - అంతర్జాతీయంగా నల్ల ధనంపై కట్టడి నేఫథ్యంలో గతేడాది స్విస్ బ్యాంకుల్లో తమ అకౌంట్లను క్లోజ్ చేసిన వారి సమాచారం కూడా ఇందులో ఉందని తెలుస్తోంది. గతేడాది కనీసం ఒక్క రోజైనా ఖాతాను కలిగి ఉన్న భారతీయుల పేర్లను కూడా స్విస్ అధికారులు అందజేశారట. ఈ జాబితాలో మన దేశంలో వ్యాపారం చేసి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టేసి స్విస్ బ్యాంకులకు తమ సంపాదనను తరలించిన వ్యాపార వేత్తలతో పాటు పలువురు ఎన్నారైన వివరాలు కూడా ఉన్నాయన్న వాదన తెలుస్తోంది.
వ్యాపార వేత్తల సంగతి సరే... మరి జాబితాలో రాజకీయ నేతల పేర్లు లేవా? అంటే... దానిపై ఇప్పటిదాకా ఎలాంటి సమాధానం రావడం లేదు. అసలు ఈ జాబితాలో అక్రమ సంపాదన పోగేసిన పొలిటీషియన్లు ఉన్నారా? లేదా? అన్న వివరాలను కూడా వెల్లడించేందుకు అటు స్విస్ అధికారులు గానీ, ఇటు ఆ దేశ జాబితా చేతిలో పెట్టుకున్న మన అధికారులు గానీ నోరు మెదపడం లేదు. దీంతో అసలు ఈ జాబితాలో నల్ల కుబేరులుగా మారిన రాజకీయ నేతల వివరాలు ఉండే అవకాశమే లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. వివరాలు అందేదాకా.. వివరాలు లేవని చెప్పిన మోదీ సర్కారు... ఇప్పుడు వివరాలు చేతికందిన తర్వాత వాటిని బయటపెట్టేందుకు ఎందుకు తాత్సారం చేస్తుందన్న దిశగానూ పెద్ద చర్చకే తెర లేసిందని చెప్పక తప్పదు. మొత్తంగా స్విస్ డేటా చేతికందిన నేపథ్యంలో నల్ల కుబేరులపై మోదీ సర్కారు చర్యలు ఎలా ఉంటాయన్నదే ఆసక్తికరంగా మారింది.