Begin typing your search above and press return to search.
క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి..? దానిని ఎలా కొనుగోలు చేయాలి..?
By: Tupaki Desk | 24 Nov 2021 2:30 AM GMTబిట్ కాయిన్.. క్రిప్టో కరెన్సీ.. ఈ పదాల గురించి వింటున్నాం.. చూస్తున్నాం.. కానీ వదిలేస్తున్నాం. క్రిప్టో కరెన్సీ అంటే కంప్యూటర్ పరిభాషలో నగదు. అయితే అధికారింగా ఇది చెల్లుబాటు కాదు. ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్లు దీనిని ఉపయోగించుకుంటారు. క్రిప్టో కరెన్సీతో వ్యాపారం చేసి బిలియనీర్లు అయిన వారు ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. కానీ వారిలో చాలా మంది మోసం చేసినవారే ఎక్కువగా ఉన్నారు.
అయినా కొందరు క్రిప్టో కరెన్సీతో నమ్మకంగా వ్యాపారం చేస్తారు. అయితే దీనిని భారత్ లో నిషేధించారు. అంతేకాకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నియంత్రణ కోసం బిల్లు కూడా పెట్టనున్నట్లు సమాచారం. ఈ తరుణంలో క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
పురాతన కాలంలో వస్తుసేవలను మార్చుకునేవారు. తమకు అవసరమున్న వస్తువును ఇతరులకు ఇచ్చి.. వారికి కావాల్సని వస్తువులను తెచ్చుకునేవారు. దీనిని బార్టరింగ్ అంటారు. ఆ తరువాత మారిన పరిస్థితులకు అనుగుణంగా బంగారం, వెండి, కరెన్సీ తయారైంది. అయితే ఇప్పుడంతా డిజిటల్ విప్లవం. మనీ ట్రాన్స్ ఫర్ అంతా ఆన్లైన్లోనే ట్రాన్స్ ఫర్ అవుతూ ఉంటుంది.
అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య బ్యాంకులు మధ్యవర్తిత్వం వహిస్తాయి. అలా వహించడమే కాకుండా వారిని నియంత్రిస్తాయి. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య నగదు మార్చుకున్నప్పుడు మధ్యవర్తి లేకుండా వ్యవహారాలు జరుపుకునేందుకు కొందరు క్రిప్టో కరెన్సీని సృష్టించారు.
మనకు నగుదు అవసరమైనప్పుడు, దాచుకున్నప్పుడు మధ్య వర్తిగా బ్యాంకులు ఉంటాయి. ఈ సాంప్రదాయ కరెన్సీని మార్చుకున్నపుడు బ్యాంకులు ఫీజులు వసూలు చేస్తాయి. కానీ క్రిప్టో కరెన్స మీద ఏ బ్యాంకు నియంత్రణ ఉండదు. ఇదంతా బ్లాక్ చెయిన్ అనే టెక్నాలజీ మీద నడుస్తుంది.
అమెరికాలో 2008లో ఆర్థిక మాంద్యం ఏర్పడిన తరువాత బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో ఫియట్ కరెన్సీకి భద్రత లేకుండా పోయింది. దీంతో సటోషి నకమొటో అనే గుర్తుతెలియని వ్యక్తి అదే సంవత్సరం అక్టోబర్ 31న సెంట్రలైజ్ నియంత్రణ లేని ‘పీర్ టు పీర్ ’ అనే ఎలక్ట్రానిక్ మనీ ఆలోచన చేశారు.
2009 జనవరి 3వ తేదీన సటోషి బ్లాక్ చెయిన్ వ్యవస్థ ఆధారంగా పనిచేసే క్రిప్టో కరెన్సీ ‘బిట్ కాయిన్’ ను తయారు చేశాడు. ఈ వ్యవస్థ మెల్ల మెల్లగా పుంజుకుంది. అయితే సటోషి ఈ విధానం నుంచి అదృశ్యమయ్యాడు. అయితే బిట్ కాయిన్ నియంత్రణ గావిన్ అండర్సన్ అనే వ్యక్తి చేతుల్లోకి వెళ్లింది. ఆ తరువాత దాని మీద అధికారం వికేంద్రీకరించారు. దీంతో ఏ ఒక్కరి చేతుల్లో ఇది కేంద్రీకృతమై ఉండదు.
సటోషి మొదట సృష్టించిన మొదటి బిట్ కాయిన్ విలువ భారత కరెన్సీ ప్రకారం అర పైసా మాత్రమే. ఆ తరువాత 2010లో చాలా మందిలో దీనిపై ఆసక్తి పెరిగింది. దీంతో ఇదే సంవత్సరం 83 సెంట్లు అంటే ఒక డాలర్ లో 85 శాతం పెరిగింది. 2010మే 22న ప్లోరిడాకు చెందిన హాన్యే అనే వ్యక్తి 10,000 బిట్ కాయిన్ చెల్లించి రెండు పిజ్జాలను కొన్నాడు.
2013 నుంచి బిట్ కాయిన్ విలువ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత నవంబర్ నెలలో బిట్ కాయిన్ విలు భారత కరెన్సీ ప్రకారం 43,33,656 ట్రేడ్ అవుతోంది. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడానికి ఇండియన్ యూత్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కోక్కరు రూ. 10వేల రూపాయల వరకు దీనిపై వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఆసరగా చేసుకొని భారత్ లో 100 స్టార్టప్ కంపెనీలు వెలిశాయి.