Begin typing your search above and press return to search.

సోషల్‌ మీడియాపై నిబంధనల కత్తి .. రేపట్నుంచే అమల్లోకి !

By:  Tupaki Desk   |   25 May 2021 8:30 AM GMT
సోషల్‌ మీడియాపై నిబంధనల కత్తి .. రేపట్నుంచే అమల్లోకి !
X
ఇండియా లో సోషల్‌ మీడియాపై నిబంధనల ఆంక్షలకి సమయం ఆసన్నం అయ్యింది. దిగ్గజ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ కేంద్రం చర్యలకు రెడీ అవుతున్నట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. సోషల్‌ మీడియా కట్టడికి ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం కొత్త నియమావళి రూపొందించింది. ఈ రూల్స్‌ రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఆ మార్గదర్శకాల్లో సూచించిన విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి సామాజిక మాధ్యమాలకు, ఓటీటీలకు మే 25 దాకా సమయం ఇచ్చింది. అయితే ఆ గడువు నేటితో ముగియనుంది. అంటే గడువు ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది. ఒకవేళ ఈ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు కొత్త నియమనిబంధనల్ని అంగీకరించకపోతే నిషేధం తప్పదు. ఆ నియమావళి ప్రకారం, అన్ని రకాల సామాజిక మాధ్యమాలూ తమతమ ప్లాట్‌ఫామ్‌లపై పోస్ట్‌ అయ్యే సమాచారం విషయంలో అత్యంత జాగరూకతతో ఉండాలి.

అలాగే వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి సోషల్‌ మీడియా సంస్థలు ఒక అధికారిని నియమించాలి. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా అధికారి ఆ విషయా న్ని వారికి తెలియజేయాలి. ఓటీటీ మాద్యమాల్లో మూడు అంచె వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరని చెప్పకపోయినా, వాటి సమాచారాన్ని మాత్రం ఇవ్వాలని చెప్పింది కేంద్రం. సోషల్‌ మీడియా సంస్థలు చట్టాలు, నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూడడం కోసం చీఫ్‌ కంప్లయన్స్‌ అధికారిని నియమించాలని కూడా కేంద్రం నిబంధనల్లో పొందుపర్చింది. పోలీసులు, సీబీఐలాంటి ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ ఏజెన్సీలకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా నోడల్‌ కాంటాక్ట్‌ పర్సన్‌ ను కూడా నియమించాలని చెప్పింది.

ఫిర్యాదుల పరిష్కారాల కోసం రెసిడెంట్‌ గ్రీవన్స్‌ అధికారిని నియమించాలని, వీరంతా భారత్‌ లో నివసించేవారై ఉండాలి సూచించింది. ఇలాంటి మరికొన్ని నిబంధనలను కూడా కేంద్రం విధించింది. కానీ.. ఆ నిబంధనల ప్రకారం భారతదేశానికి చెందిన ఒక్క కూ సంస్థ తప్ప మిగతా ప్రముఖ సామాజిక మాధ్యమాలు అలాంటి అధికారులను నియమించలేదు. ఈ నిబంధనల అమలుకు ప్రభుత్వం మూడు నెలల సమయమిచ్చినా చర్యలు చేపట్టలేదు. ఆయా సంస్థలు మాత్రం ఆరు నెలల సమయం అడుగుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన సమయం మించిపోవడం తో ప్రభుత్వం ఏం చేయబోతోంది ఆంట్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.