Begin typing your search above and press return to search.
ఎంఐఎం అక్బరుద్దీన్ కు షాకిచ్చిన బీజేపీ
By: Tupaki Desk | 8 Oct 2018 9:40 AM GMTహైదరాబాద్ పాతబస్తీలో పాగా వేసేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఏకంగా ఎంఐఎం ముఖ్య నేత అక్బరుద్దీన్ ను గురి చేసి కొట్టేందుకు పహ్ జాది అనే ఓ మహిళా నాయకురాలిని బరిలోకి దింపింది. వరుస విజయాలతో ఎదరులేని అక్బరుద్దీన్ ను ఢీ కొట్టేందుకు చంద్రాయణ గుట్ట నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన ఆమె గురించి ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.
షహ్ జాది ఉస్మానియాలో ఎంఏ పాలిటిక్స్ చదివారు. రాజకీయ నేపథ్యం లేకపోయినా ఏబీవీపీలో పని చేసిన అనుభవం ఉందంటున్నారు ఆమె. పాత బస్తీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా మహిళలు నిరాదరణకు గురవుతున్నారని - ఎంఐఎం నేతలు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఓ తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా ప్రశ్నించారు.
జాతీయ భావాలు ఉండాలే గానీ - మతాన్ని అవసరాలను వాడుకోకూడదని ఓవైసీ సోదరులను ఉద్దేశించి ప్రశ్నించారు షహ్ జాది. త్రిపుల్ తలాక్ అంశం అసలు ఖురాన్లోనే లేదని కావాలంటే తనతో డిబేట్ కు వస్తే నిరూపిస్తానని సవాల్ విసిరారు. ముస్లిం సమాజం కోసం పాటుపడుతున్నామని చెబుతున్న ఓవైసీ సోదరులు చిన్న పిల్లలను అరబ్బు షేక్ లు సంతల్లో పశువుల్లా కొనుక్కొని తీసుకెళ్తున్నా - ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. అక్బరుద్దీన్ పై మహిళల్లో బాగా వ్యతిరేత ఉందని, తనను చాలా మంది ఆహ్వానిస్తున్నారని తన గెలుపు తథ్యమని అంటున్నారు షహ్ జాది.
వహ్ జాదీ చాంద్రయాణ గుట్టలో బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. పక్కనున్న పాకిస్తాన్ - బంగ్లాదేశ్ లో తలాక్ ను రద్దు చేశారని.. కానీ ఇండియాలో చేస్తే ఓవైసీ సోదరులు వ్యతిరేకిస్తున్నారని ప్రచారంలో చెబుతున్నారు. ఓవైసీ సోదరుల ఆగడాలు అరికట్టాలంటే బీజేపీని గెలిపించాలని తిరుగుతున్నారు. ముస్లిం మహిళ కావడం.. అందునా కేంద్రంలో ఉన్న బీజేపీ అండదండలతో నయానా భయానో వహ్ జాదీ బలమైన ఓవైసీ సోదరులను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఎన్నాళ్లుగానే గూడుగట్టుకొని ఉన్న అసమ్మతి చెలరేగి అక్బరుద్దీన్ పై ఆమె గెలిస్తే నిజంగా సంచలనమే.