Begin typing your search above and press return to search.
గుంటూరులో సింథటిక్ డ్రగ్ కలకలం !
By: Tupaki Desk | 3 April 2021 9:30 AM GMTడ్రగ్స్ అమ్మకాలు నిన్న మొన్నటి వరకు కేవలం కాస్మోపాలిటన్ నగరాలకే పరిమితమయ్యేది.. హైదరాబాద్, ముంబై, బెంగళూర్ లాంటి నగరాల్లోనే ఎక్కువగా కనిపించేది. కానీ, ఇప్పడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా డ్రగ్స్ విక్రయాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో సింథటిక్ డ్రగ్స్ కలకలం సృష్టించాయి. గత కొన్ని రోజుల క్రితం వరకు గంజాయికే పరిమితమైన డ్రగ్స్ వ్యాపారం ఇప్పుడు సింథటిక్ డ్రగ్ తో పాటు అనేక మత్తుపదార్దాలకు అడ్డాగా మారింది.
సింథటిక్ డ్రగ్స్ ను మిథాయిల్ ఎండియోక్సీ మితమ్ పింటమిన్ ను టాబ్లెట్ ల రూపంలో విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరవై వేల రూపాయల విలువ చేసే నాలుగు టాబ్లెట్స్, వంద గ్రాముల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. పెనుమాకలో దాడిచేసిన అధికారులు డ్రగ్స్ విక్రయిస్తున్న రామ మణికంఠ, దుర్గావలి లను అరెస్ట్ చేశారు. పట్టుబడిన డ్రగ్ చాలా అరుదైనదని పోలీసులు తెలిపారు. అమరావతి ప్రాంతాల్లో పేరుమోసిన విద్యాసంస్థలతోపాటు యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఎంతోమంది విద్యార్దులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ విద్యార్థులు గంజాయికి అలవాటు పడి, ఆ మత్తుకి బానిసలుగా మారిపోయారు. నేరుగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకు గంజాయిని సరఫరా చేసేందుకు స్థానిక బ్రోకర్లతో డీల్ కుదుర్చుకుంటున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో కేజీ గంజాయిని మూడు వేలకు కొనుగోలు చేసి 10 గ్రాముల గంజాయి వంద రూపాయల చొప్పున అమ్ముతున్నారు. విద్యార్దులతోపాటు సామాన్యులు కూడా గంజాయికి బానిసలవుతున్నారు. వడ్డేశ్వరంలో ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుడు సింథటిక్ డ్రగ్ ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బైట్, వినీత్ బ్రిజ్ లాల్, సెబ్ కమిషనర్. రోజురోజుకూ డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడంతో పోలీసులు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. పట్టుబడిన ఇద్దరికి డ్రగ్స్ విక్రయించిన వారికి డ్రగ్స్‌ని ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది? ఎవరికి వీటిని విక్రయిస్తున్నారు? ఈ దందా వెనుక ఇంకా ఎవరెవరున్నారో ఆరా తీస్తున్నారు పోలీసులు. ఎంత కాలం నుంచి ఈ ఏరియాలో ఈ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు ? ఈ వ్యవహారంలో ఇంకా ఎంత మంది ఉన్నారో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.