Begin typing your search above and press return to search.
హృదయాన్ని కదిలిస్తున్న చిన్నారుల ఫ్లకార్డులు!
By: Tupaki Desk | 26 July 2016 9:21 AM GMTసిరియాలో అంతర్యుద్ధం వల్ల లక్షల మంది నిరాశ్రయులయ్యారు - కుటుంబంలో ఉన్న నలుగురూ చెట్టుకొకరు - పుట్టకొకరుగా అయిపోయారు. అక్కడి చిన్నారుల పరిస్థితి అయితే మరీ దారుణమనే చెప్పాలి. స్కూల్స్ లేక - చదువులేక - బయట ఆడుకోలేక - భవిష్యత్తుగురించి అందకారంలోనూ - అభద్రతాభావంలోనూ కలలుగంటున్న చిన్నారులు లక్షల మందే ఉన్నారు. ఈ చిన్నారులు పడే బాధను ప్రపంచానికి తెలియజేసేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది రెవల్యూషనరీ ఫోర్స్ ఆఫ్ సిరియా అనే సంస్థ. దీనికోసం ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన పోకెమాన్ గో గేమ్ ను ఎంచుకుంది.
ఈ పోకెమాన్ గో గేమ్ ను ఆడేవాళ్లు నడుస్తూ ప్రాంతాలు - దేశాలూ దాటిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గేమ్ లోని పాత్రలను కాదు.. ఆపదలో ఉన్న మమ్మల్ని సైతం గుర్తించి.. రక్షించండంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన ఇస్తున్నారు సిరియాలోని చిన్నారులు. హృదయాలను కదిలించే ఆ సంఘటనలు సిరియాలో పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి. ఎప్పటికైనా ప్రపంచం తమవైపు చూసి ఆదుకుంటుది అన్న నమ్మకంతో బతుకీడుస్తున్నారు అక్కడి లక్షలాది మంది ప్రజలు.
పోకెమాన్ గేమ్ లో ఏ బొమ్మల కోసం వెతుకుతున్నారో.. అలాంటి బొమ్మలను అట్టముక్కలపై గీసి వాటి కింద "మేము సిరియాలో ఉన్నాము. దయచేసి మమ్మల్ని రక్షించండి" అంటూ మౌన రోదన చేస్తున్నారు. వీటిని చూసైనా ప్రభుత్వాలు - దాతలు ముందుకు వచ్చి అక్కడి ప్రజలకు సాయం చేస్తారన్న నమ్మకంతో ఈ పోకెమాన్ బొమ్మలను ఎంచుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.