Begin typing your search above and press return to search.

మెదడు, కంప్యూటర్​ ఒక్కటే.. ఇదే సాక్ష్యం..!

By:  Tupaki Desk   |   5 March 2021 12:30 AM GMT
మెదడు, కంప్యూటర్​ ఒక్కటే.. ఇదే సాక్ష్యం..!
X
మనమెదడు ఎలా పనిచేస్తుంది.. అనే విషయంపై ఇప్పటికే అనేక పరిశోధనలు జరిగాయి. అయితే ఇంతవరకు పూర్తిస్థాయిలో మాత్రం పరిశోధనలు సాగలేదు. మనం ఏదైనా డాటాను డిజిటల్​ రూపంలో కంప్యూటర్​లో నిక్షిప్తం చేస్తాం.. అలాగే మెదడులోనూ ఓ వ్యవస్థ ఉంటుంది. మన జ్ఞాపకాలను, మనం చూసిన వస్తువులను, మనుషులను పేర్లను స్టోర్​ చేసుకోవడానికి అచ్చం కంప్యూటర్​లాగే మెదడులోనూ ఓ వ్యవస్థ ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. కెంట్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఇందుకు సంబంధంచి పరిశోధనలు చేసి ఓ కీలక విషయాన్ని కనిపెట్టారు.

MeshCODE థియరీని కనిపెట్టారు. ఈ థియరీ ద్వారా మెదడు పనితీరును పూర్తిస్థాయిలో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. తద్వారా మెదడుకు సంబంధించిన అనేక వ్యాధులను తగ్గించవచ్చని వాళ్లు అంటున్నారు. ముఖ్యంగా అల్జీమర్స్​ అనే వ్యాధి చికిత్సలో ఈ థియరీ ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ కొత్త థియరీ‌తో మెదడు పనితీరుపై సమగ్రమైన అధ్యయనం జరిపారు. మెదడులోని అతి సున్నితమైన సూక్ష్మ కణాలు సూపర్ కంప్యూటర్ మాదిరిగా కాంప్లెక్స్ బైనరీ కోడ్‌తో న్యూరోనల్ సెల్స్ నిక్షిప్తమై ఉంటాయి. ఈ న్యూరో సెల్స్ మెకానికల్ కంప్యూటర్ లా నిరంతరం పనిచేస్తుంటాయి.

కంప్యూటర్ లో డేటా బైనరీ కోడ్ ఉంటుంది. అలాగే మెదడులోని న్యూరో కణాలు బైనరీ కోడ్ లాగా పనిచేస్తుంటాయి. మెదడులోని ప్రతి సినాప్సే కాంప్లెక్స్ బైనరీ కోడ్ లా పనిచేస్తూ మెమరీ అణువులను స్టోర్ చేస్తుంటుంది. ఈ కోడ్ ద్వారా బ్రెయిన్‌లో స్టోరేజీ డేటా ఫిజికల్ లొకేషన్ గుర్తిస్తుంది. మెదడులో స్టోర్ అయ్యే మెమరీలన్నీ సినాప్టిక్ పరంజా ప్రోటీన్ ఆకారంలో కనిపిస్తాయి. 0, 1 అనే రెండు స్టేబుల్ బైనరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది.


బైనరీ ఫార్మాట్ లో మెమరీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. కంప్యూటర్​లో మనం సమాచారాన్ని సేవ్​ చేసుకోవచ్చు. అయితే మెదడులోనూ ఇటువంటి ఓ పంక్షన్​ ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
మెదడులో ఉండే సైటోస్కెలిటన్ కణాల ద్వారా బైనరీ ఫార్మాట్ రూపంలో సమాచారం నిక్షిప్తమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మెదడులో సినాప్సే మధ్య ట్రిలియన్ల కొద్ది న్యూరాన్లు ఎలక్ట్రో కెమికల్ సిగ్నలింగ్ చేస్తుంటాయి.
ఈ మెకానికల్ కోడింగ్ నిరంతరం ప్రతి న్యూరాన్ తో కలిసి పనిచేస్తూ అన్ని కణాలకు విస్తరించేలా చేస్తుంది. అయితే కంప్యూటర్​ కూడా అచ్చం ఇలాగే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.