Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ షురూ

By:  Tupaki Desk   |   21 Jan 2023 6:10 AM GMT
టీ కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ షురూ
X
ఇన్నాళ్లు అసంతృప్తులు.. అసమ్మతులతో అగ్గి రాజేసిన కాంగ్రెస్ సీనియర్లు ఒక్కటి అవుతున్నారు. అందరూ ఒక్క చోటకు వస్తున్నారు. నిన్న అసమ్మతి రాజేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డితో మాట్లాడడం.. ఒక్కటి కావడంతో అతిపెద్ద అడ్డంకి తొలగింది. సీనియర్లు కూడా దారికి వస్తున్నారు. దీంతో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాలపై ఇంటర్నల్ సర్వే చేస్తున్నట్టు సమాచారం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా ఈ తప్పనిసరి గెలిచే రూట్లలోనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అసంతృప్తులతో చర్చలు, బుజ్జగింపులు కూడా షురూ అయ్యాయి. పేరున్న నేతలకు గాలం వేసేందుకు ప్లాన్ రెడీ చేశారు.

ప్రధానంగా మూడు ఉమ్మడి జిల్లాలతోపాటు కేడర్ ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 50 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇంటర్నల్ సర్వే ద్వారా గుర్తించింది. దీంతోపాటు చుట్టుపక్కల నియోజకవర్గాలపై ఇంకాస్త దృష్టి పెడితే మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ కావొచ్చని భావిస్తోంది.

టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర రూట్ మ్యాప్ సైతం ఈ రూట్లలోనే ఉండే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో అధికారంలోకి రావడంతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ స్థానాలను సైతం కైవసం చేసుకోవడానికి ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టింది. అందులో భాగంగానే తొలుత 3 రిజర్వుడు లోక్ సభ స్థానాలకు కో ఆర్డినేటర్లను నియమించింది. మిగిలిన రిజర్వుడు నియోజకవర్గాలకు కూడా త్వరలోనే కోఆర్డినేటర్లను నియమించనున్నారు.

చేరికలపై కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ విధానాలతో విసిగిపోయిన లీడర్లను తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది. ముఖ్యమైన నేతలకు గాలం వేసే పనిలో ఉన్నది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరుపుతోంది. పొంగులేటిని భట్టి పార్టీలోకి కూడా ఆహ్వానించారు. ఈసారి ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం సాధించేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.