Begin typing your search above and press return to search.

తెలంగాణలో చింత‌న్ శిబిర్.. ఏం చెప్ప‌నుంది ?

By:  Tupaki Desk   |   31 May 2022 8:30 AM GMT
తెలంగాణలో చింత‌న్ శిబిర్.. ఏం చెప్ప‌నుంది ?
X
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగం లో చెప్పుకోద‌గ్గ మార్పులేమీ లేవు. కానీ చెప్పుకోద‌గ్గ ఫలితాలు రావ‌లంటే చెప్పుకోద‌గ్గ రీతిలో అంతా క‌లిసి ప‌నిచేయాలి. ఇందుకు వ‌చ్చే నెల 1,2 తేదీల‌లో జ‌రిగే చింత‌న్ శిబిర్ స‌హ‌క‌రిస్తే మేలు. మేడ్చ‌ల్ జిల్లా, కీస‌ర ద‌గ్గ‌ర బాల వికాస్-లో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మం పార్టీ ప్ర‌క్షాళ‌నకు, ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇప్ప‌టికే రేవంత్ రెడ్డి స్థాయిలో కొంత మార్పు ఉన్నా కూడా అది కంటిన్యూ కావాలంటే, పార్టీ నాయ‌కులు దిగువ స్థాయికి చేరుకుని ప‌నిచేయాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రువు నిల‌బ‌డాలంటే కొంద‌రు కొన్నింటిని వ‌దులుకుని ప‌నిచేయాలి.

ముఖ్యంగా నాయ‌క‌త్వాల మ‌ధ్య స‌మ‌న్వ‌య లేమి అన్న‌ది తొల‌గిపోతే మంచి ఫ‌లితాలే రావొచ్చు. అందుకు రేవంత్ తో స‌హా అంతా కృషి చేయాల్సి ఉంది. మొత్తం ఆరు క‌మిటీలు ఆరు అంశాల‌పై మొద‌టి రోజు చ‌ర్చించి, వాటి ఫ‌లితాల‌ను రెండో రోజు డిక్లైర్ చేస్తారు.

ఆర్థికం, వ్య‌వ‌సాయం, రాజ‌కీయం ఇలా ప‌లు రంగాల‌కు సంబంధించి చ‌ర్చ అయితే జ‌ర‌గ‌నుంది. రాజ‌స్థాన్, ఉద‌య్ పూర్ లో జ‌రిగిన చ‌ర్చ మాదిరి ఇక్కడ కూడా స‌మాలోచ‌న‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆరు గ్రూపు ఆరు అంశాలు చ‌ర్చించ‌నున్నాయి. వీటికి సీనియ‌ర్ నాయ‌కులు నేతృత్వం వ‌హిస్తారు.

వాస్త‌వానికి తెలంగాణ వాకిట ఒక‌ప్పుడు కాంగ్రెస్-కు ప‌ట్టున్న ప్రాంతాలు అన్నీ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి. బ‌ల‌మైన ద‌ళిత ఓటు బ్యాంక్ కూడా లేకుండా పోయింది. ద‌ళిత బంధులాంటి ప‌థ‌కాల్లో డొల్ల‌త‌నంను ప్ర‌జ‌లకు వివ‌రించే ప్ర‌య‌త్నం ఒక‌టి కాంగ్రెస్ చేయాలి. కొన్ని ఊళ్ల‌లో తె లంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కులకు చెందిన వారికే ఈ ప‌థ‌కం వ‌ర్తింపు అవుతోంది.

వీటికి ఆధారాలు ఉన్నా కూడా కాంగ్రెస్ పెద్ద‌గా మాట్లాడ‌డం లేదు. ఒక‌ప్పుడు బీసీలంతా టీడీపీ వైపు కొంత, కాంగ్రెస్ వైపు కొంత ఉండేవారు. టీడీపీ లేక‌పోవ‌డంతో వారంతా త‌ప్ప‌క తెలంగాణ రాష్ట్ర స‌మితి వైపు వెళ్లిపోయారు. బీజేపీ కూడా బీసీల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అవుతుంద‌న్న వార్త‌లొస్తున్నాయి. క‌నుక ఈ ద‌శ‌లో బ‌ల‌మైన నాయ‌కత్వం కార‌ణంగా కాంగ్రెస్ మ‌ళ్లీ పుంజుకోవ‌డం ఖాయం. ఇందుకు చింత‌న్ శిబిర్ స‌హ‌క‌రిస్తే ఇంకా మేలు.