Begin typing your search above and press return to search.
తెలంగాణ కాంగ్రెస్ రోడ్డు మీదకు వచ్చింది
By: Tupaki Desk | 24 Aug 2016 10:23 AM ISTమహరాష్ట్ర సర్కారుతో చారిత్రక ఒప్పందం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా రోడ్డు మీదకు వచ్చింది. నల్ల జెండాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపే ప్రయత్నం చేయటం గమనార్హం. తెలంగాణ సర్కారు చేసుకున్న ఒప్పందం చారిత్రకమైనది కాదని రాష్ట్రానికి శాశ్వితంగా ద్రోహం చేసేదిగా వారు అభివర్ణిస్తున్నారు. తమ హయాంలో షురూ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్ కు మంచిపేరు వస్తుందన్న ఉద్దేశంతో వాటిని పూర్తి చేయటం లేదని వారు మండిపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒప్పందం కుదుర్చుకునే వేళ.. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు నిరసనల పేరుతో రోడ్డు మీదకు రావటం గమనార్హం. గాంధీ భవన్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లిన వారు.. కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మాట్లాడుతూ తెలంగాణ సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ చేయటంతో రూ.83వేల కోట్లకు భారం పెరుగుతుందని.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కారణంగా లక్షలకోట్లు దుర్వినియోగం జరుగుతుందని చెప్పారు.
తాజాగా జరిగిన ఒప్పందం నేపథ్యంలో సంబరాలు చేసుకోవాల్సింది తెలంగాణ కాదని.. మహారాష్ట్రగా టీ కాంగ్రెస్ నేత భట్టివిక్రమార్క విమర్శించటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాల్ని తెలంగాణ ప్రభుత్వం తిరిగి చేసుకుంటుందే తప్పించి.. కొత్త ఒప్పందాలుకావటి.. వాటిని చారిత్రక ఒప్పందాలుగా చెప్పటం సరికాదంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ కారణంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న నేతలు.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో జరిగిన మహా ఒప్పందాన్ని పరిశీలించి మార్పులు చేసి.. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామంటూ తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యానించటం గమనార్హం.