Begin typing your search above and press return to search.
‘పవర్’ లేని పదవి కోసం ఇజ్జత్ తీస్తున్నారే?
By: Tupaki Desk | 18 Dec 2020 5:30 PM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పదవి కోసం ఆ పార్టీ నేతలు పడుతున్న తిప్పలు చూస్తే.. నోటి వెంట మాట రాలేని పరిస్థితి. ఎందుకంటే.. ఆ పదవికిప్పుడు అంత గ్లామర్ లేదు.. అంతకు మించి గ్రామర్ లేదన్నది మర్చిపోకూడదు. ప్రజల్లో ఆ పార్టీ పట్ల పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే.. ప్రత్యర్థుల మీద పోరాడే దాని కంటే.. తమలో తాము తన్నుకోవటాల మీదనే వారి ఫోకస్ అంతా.
ఎవరిని చీఫ్ చేసినా.. వైరి వర్గం ఒకటి తప్పదు. అంటే.. పదవితో పాటు.. అసంతృప్త వర్గం ఒకటి తగలబడుతుంది. పీఠం మీద కూర్చున్న నాటి నుంచి పంటి కింది రాయి మాదిరి మారి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సరే.. ప్రజల్లో పార్టీకి ఆదరణ ఉంటే..అలాంటివి భరించొచ్చు. అది కూడా లేదు. ఓవైపు పవర్ లేకుండా.. మరోవైపు ప్రతిష్ఠ పనికి రాని పోస్టు ఉంటేనేంటి? ఉండకపోతేనేంటి? ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు అస్సలు పట్టించుకోవటం లేదు.
పార్టీ పదవి కోసం ఇంతకాలం తెలంగాణలో కొట్టుకున్న వారు.. ఇప్పుడు బంతి అధిష్ఠానం కోర్టులో పడటంతో.. పోటాపోటీగా ఢిల్లీకి వెళ్లి రాయబారాలు చేయటం షురూ చేశారు. టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న వారిలో రేవంత్ మొదటి స్థానంలో నిలిస్తే.. కోమటిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఇక.. భట్టి.. శ్రీధర్ బాబు లాంటి వారితో పాటు.. తమకున్న అర్హత ఎంత? ప్రజల్లో పట్టు ఎంతన్న విషయాన్ని వదిలేసి మరీ.. పీసీసీ ఛీప్ పదవి కోసం ప్రయత్నిస్తున్న వీహెచ్.. మర్రి శశిధర్ రెడ్డి లాంటి వారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
పవర్ లేని పదవి కోసం ప్రాకులాడుతున్న టీ కాంగ్రెస్ నేతలు తమకున్న ‘అతి’ని ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు చూపించటం షురూ చేశారు. అధ్యక్ష నియామకం విషయంలో ఆలస్యం కావటంతో.. దాన్నో అవకాశంగా తీసుకొని.. ఎవరికి వారు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ సీనియర్లకు ఒళ్లు మండేలా చేస్తున్నాయట. ఢిల్లీ స్థాయి నేతలు అయితే తెలంగాణ నేతల విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉండటమే కాదు.. అసలు మీరెందుకు ఢిల్లీకి వస్తున్నారంటూ దులిపేస్తున్నారట. ఈ పరిణామం తెలుగోళ్ల ఇజ్జత్ తీయటం కాక మరేంటన్న మాట వినిపిస్తోంది.
అన్నారంటే అన్నరనుకుంటాం కానీ.. ఢిల్లీ వీధుల్లో నిలుచొని పదవి కోసం ఇంతలా పాకులాడాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరచూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతుంటారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడతారని తిడతారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే.. పదవి కోసం అంతలా తిరిగి.. పరువు తీసుకోవాలా? అన్నది ప్రశ్న. అర్హత ఉంటే.. తప్పనిసరిగా దక్కుతుంది కదా? పార్టీ కోసం ప్రజల మధ్యకు వెళ్లి వారితో కనెక్టు అయితే.. ఢిల్లీ నేతలే పిలిచి పదవి ఇస్తారు. అందుకు భిన్నంగా.. అదే పనిగా ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ కనిపించిన ప్రతి ఒక్కరి చేత రికమెండ్ చేయించుకోవటానికి మించిన దరిద్రం ఇంకేం ఉంటుంది? అలా దేబిరించుకొని మరీ సొంతం చేసుకునే పదవికి గౌరవం ఉంటుందా? మర్యాద ఉంటుందా? తాము ప్రాతినిధ్యం వహించే తెలుగోళ్ల పరువు తీసేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతల తీరు కాలిపోయేలా చేస్తుందని చెప్పక తప్పదు.