Begin typing your search above and press return to search.
కేసీఆర్ ట్రాప్‌లో పడిపోయిన తెలంగాణ కాంగ్రెస్
By: Tupaki Desk | 9 Jun 2015 5:31 AM GMTవ్యూహాలు రచించటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఓటుకు నోటు వ్యవహారం కచ్ఛితంగా తెలంగాణ అధికారపక్షానికి.. ఏపీ అధికార పక్షానికి మధ్య నడుస్తున్న యుద్ధం. ఈ విషయం అందరికి తెలుసు. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.
ఎక్కడైనా.. తమ ప్రత్యర్థిపై దృష్టి సారిస్తారే తప్పించి.. తమను అంతగా ప్రమాదం లేని ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించరు. వాస్తవానికి..ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబునాయుడ్ని తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి వారి లక్ష్యం తెలంగాణ అధికారపక్షమైన టీఆర్‌ఎస్ నేతలు మాత్రమేనన్న విషయాన్ని మర్చిపోయారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు బలం లేకున్నా కేసీఆర్ సర్కారు ఏ విధంగా సొంతం చేసుకుందన్న విషయాన్ని ప్రశ్నించటం మానేసి.. తెలంగాణ అధికారపక్ష నేతల మాదిరే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. రాజకీయంగా చూస్తే.. బాబును దెబ్బ తీయటం కేసీఆర్‌కు లాభం చేకూరుతుందే తప్పించి.. తెలంగాణ కాంగ్రెస్‌కుఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఈ చిన్న లాజిక్ మిస్ అయిన టీ కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై విరుచుకుపడాల్సింది పోయి.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద విరుచుకుపడుతూ తెలంగాణ అధికారపక్ష గొంతును తమ గొంతుగా చేసుకొని చెలరేగిపోతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏదైనా రాజకీయ ప్రయోజనం కలిగితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మాత్రమే కానీ.. టీ కాంగ్రెస్‌కు కాదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు ఎప్పటికి గుర్తిస్తారో..?