Begin typing your search above and press return to search.
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్
By: Tupaki Desk | 18 March 2019 5:35 PM GMTప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో అప్పటినుంచో అసలు తెలంగాణ విఫక్షం అనేది లేకుండా చేసేందుకు ఆయన తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వెనుక మంత్రాంగం ఏదైనా జరగనీ.. పార్టీ మారే ఎమ్మల్యేలంతా నియోజక అభివృద్ధి అని బయటికి చెప్తూ.. ఎంచక్కా కారెక్కుస్తున్నారు. దీంతో.. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం దాదాపు పడిపోయింది. ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. 88 సీట్లు గెల్చుకున్న టీఆర్ ఎస్ తన బలాన్ని ఇప్పుడు 100కి పెంచుకుంది.
తమ ఎమ్మెల్యేలంతా కారెక్కుతుండడంతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. క్రమశిక్షణ చర్యల పేరుతో భయపెట్టేందుకు ట్రై చేస్తోంది.ఇందులో భాగంగా.. పార్టీ నియమాళికి వ్యతిరేకంగా పనిచేసిన ఆరుగురు తెలంగాణ కాంగ్రెస్ నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ అదేశాలను ఉల్లంఘించినందుకు ఆరేపల్లి మోహన్ - రమ్యారావు - మన్నె కృష్ణ - సోయం బాపూరావు - నరేశ్ జాదవ్ - పట్లోల్ల కార్తీక్ రెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు టీకాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి టీఆర్ ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలకు కూడా షోకాజు నోటీసులు జారీచేయాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కోదండరెడ్డి తెలిపారు. అయితే ఇందతా ముందు చేసి ఉంటే కొందరన్నా భయపడి ఉండేవారని.. ఇప్పుడు వెళ్లిపోయాక సస్పెండ్‌లు, షో కాజ్ నోటీసులు ఎందుకుని అంటూ విమర్శలు వస్తున్నాయి. అయినా ప్రస్తుతం విమర్శలు పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు లేరు.