Begin typing your search above and press return to search.
తేలిపోయింది.. టీ కాంగ్రెస్ ఇంకెప్పటికి బాగుపడదని!
By: Tupaki Desk | 25 Sep 2021 4:30 AM GMTబండిని సరైన రీతిలో నడిపించే సత్తా ఉండదు కానీ.. బ్రేకులు వేయటం.. బండి నడిపించే తీరును అదే పనిగా తప్పు పట్టటం లాంటివి చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే చాలు.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు రుణపడిపోతారని.. ఆ భావనతో జీవితాంతం తమకు అధికారాన్ని చేతికి ఇస్తూనే ఉంటారన్న దరిద్రపుగొట్టు వాదనతో అధినేత్రి సోనియమ్మను పక్కదారి పట్టించిన నేతలు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకు ఏ మేరకు బాధ్యత వహించారో అందరికి తెలిసిందే.
రాష్ట్ర విభజన తర్వాత టీ కాంగ్రెస్ కు రథసారధిగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్య కానీ.. ఆ తర్వాత ఆయన సీటులో కూర్చున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ.. పార్టీని ఎలా నడిపించారన్నది అందరికి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమించిన నాటి నుంచి పరిస్థితుల్లో మార్పు రావటమే కాదు.. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పొంగి పొర్లుతున్న విషయం తెలిసిందే. తాము చేయలేనిది మరెవరూ చేసినా తట్టుకోలేని తీరు కాంగ్రెస్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.
అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఇప్పటికే పార్టీని భ్రష్టు పట్టించిన నేతలు.. అధికారం దూరమైన ఏడున్నరేళ్లు అయి.. ఒక దశలో ఉనికి సైతం ప్రశ్నార్థకంగా మారినప్పుడు గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవటానికైనా సిద్ధమే కానీ.. ప్రజల్లో ఆదరణ పెంచేలా ఎవరైనా ప్రయత్నిస్తుంటే మాత్రం.. వారికి మోకాళ్లు అడ్డుగా పెట్టటం అలవాటుగా మారింది. తాజాగా రేవంత్ రెడ్డిపై తరచూ ఏదో ఒకలా విమర్శలు చేయటం.. ఆరోపణలు సంధించటం.. ఆయన ఉత్సాహం మీద నీళ్లు కుమ్మరించటం లాంటి పనుల్ని.. సీనియర్లు చేస్తుండటం తెలిసిందే.
రేవంత్ ను టీపీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టిన నాటి నుంచి సీనియర్లు వర్సెస్ రేవంత్ అన్నట్లుగా పోరు సాగుతూనే ఉంది. ప్రతి విషయాన్ని పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయాలు బయటకు చెప్పాలని.. తమతో మాట్లాడిన తర్వాతే కేడర్ లోకి వెళ్లాలని సీనియర్లు చెబుతున్నారు. దీనికి భిన్నంగా రేవంత్ దూకుడు ఉంటోంది. సీనియర్లు చెప్పింది వింటూ.. అవునవును అంటూనే తాను చేయాల్సిన పని తాను చేసుకుంటూ పోతున్నారు. వాస్తవానికి అన్ని విషయాల్ని అందరికి చెప్పి.. చర్చించి నిర్ణయాలు తీసుకోవటం సాధ్యమయ్యే పని కాదు.
ఏడేళ్లుగా ఏడుస్తున్న పార్టీని ఒక కొలిక్కి తీసుకొచ్చి..కొత్త ఉత్సాహాన్ని పొంగి పొర్లేలా చేస్తున్న రేవంత్ స్పీడ్ కు బ్రేకులు వేయటం.. ఆయనకు మాత్రమే కాదు.. తమకు కూడా నష్టమే అవుతుందన్న విషయాన్ని టీ కాంగ్రెస్ సీనియర్లు మిస్ అవుతున్నారు. కాంగ్రెస్ అంటేనే.. కొట్లాటల పార్టీ అన్న పేరుకు తగ్గట్లే.. పవర్ పోయాక కూడా తమ తీరు మార్చుకోకకుండా చిల్లరగా వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో పలుచన అయ్యేలా చేస్తోంది.
ఓపక్క గులాబీ బాస్ కేసీఆర్ దూసుకెళ్లిపోతుంటే.. ఆయన దూకుడుకు కళ్లాలు వేసే కన్నా.. తమ పార్టీని నడిపిస్తున్న రేవంత్ కు మైలేజీ పోకూడదన్న భావనే ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ బాగు పడే కన్నా.. తమ ఇగో సంత్రప్తి చెందేలా వ్యవహరిస్తున్న నేతల కారణంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపరం కలిగేలా సీనియర్లు వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ‘కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి బాగుపడదు. దాని బతుకు అంతే.. చేతిలో అధికారం లేకున్నా కొట్టుకు చావటం మాత్రం ఆపరంటూ’ ప్రజలు తిట్టుకుంటున్న వైనాన్ని నేతలు గుర్తిస్తే మంచిది. అందుకు భిన్నంగా రేవంత్ ఇమేజ్ పెరగటాన్ని జీర్ణించుకోలేకపోతే.. మొదటికే మోసం వస్తుందన్న వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. తాజాగా జగ్గారెడ్డి ఎపిసోడ్ చూసిన తర్వాత.. ఇక ఎప్పటికి కాంగ్రెస్ పార్టీ బాగుపడదన్నభావనకు రావటం గమనార్హం.