Begin typing your search above and press return to search.

ఏపీలో టీ స్పీక‌ర్ కు అవ‌మానం జ‌రిగిందా?

By:  Tupaki Desk   |   10 Jun 2019 12:28 PM GMT
ఏపీలో టీ స్పీక‌ర్ కు అవ‌మానం జ‌రిగిందా?
X
కొత్త వివాదం తెర మీద‌కు వ‌చ్చింది. ఏపీ ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి హాజ‌ర‌య్యారు. అయితే.. ఆయ‌న్ను మూడో వ‌రుస‌లో కూర్చోబెట్టారు. ఇలా చేయ‌టం ప్రోటోకాల్ ప్ర‌కారం స‌రికాద‌ని.. స్పీక‌ర్ కు ఏపీలో అవ‌మానం జ‌రిగింద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి కొత్త వివాఆన్ని తెర మీద‌కు తెచ్చారు.

జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పాటు వెళ్లిన స్పీక‌ర్ పోచారం.. వీఐపీ గ్యాల‌రీలో మూడో వ‌రుస‌లో కూర్చున్నార‌న్న‌ది జీవ‌న్ రెడ్డి వాద‌న‌.అయితే.. తెలంగాణ స్పీక‌ర్ ను.. ఆ హోదాలో ఏపీ అధికారులు పిలిచారా? అన్న ప్ర‌శ్న‌కు జీవ‌న్ రెడ్డి స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు. ఒక‌వేళ ఏపీ ప్ర‌భుత్వం నుంచి స్పీక‌ర్ కు ఆహ్వానం పంపితే మాత్రం.. ఏపీ అధికారులు స‌మాధానం చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

ఇది తెలంగాణ స్పీక‌ర్ కు జ‌రిగిన అవ‌మానం కాద‌ని.. యావ‌త్ తెలంగాణ‌కు జ‌రిగిన అవ‌మానంగా జీవ‌న్ రెడ్డి అభివ‌ర్ణించారు. దీనికి బాధ్య‌త వ‌హిస్తూ స్పీక‌ర్ రాజీనామా చేయాల‌న్నారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన అనంత‌రం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వేదిక మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌క్క‌న త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత స్టాలిన్ ను కూర్చోబెట్టార‌ని.. ప్రోటోకాల్ విష‌యం క‌నీసం కేసీఆర్ కు కూడా తెలీదా? అని ప్ర‌శ్నించారు.

ఈ వివాదంపై ఆరా తీస్తే..విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. తెలంగాణ స్పీక‌ర్ హోదాలో పోచారానికి ఎలాంటి ఆహ్వానం అంద‌లేద‌ని తెలుస్తోంది. ఈ కార‌ణంగానే ప్రోటోకాల్ ప్ర‌కారం ఎలాంటి ఏర్పాట్లు చేయ‌లేదంటున్నారు. స్పీక‌ర్ లాంటి రాజ్యాంగ‌ప‌ర‌మైన స్థానాల్లో ఉన్న వారు.. బ‌య‌ట‌కు వెళ్లాలంటేఅన్ని అంశాల్నిస‌రి చూసుకొని మాత్ర‌మే వెళ్లాల్సి ఉంటుంది. కానీ.. పోచారం అలాంటి అంశాలు పెద్ద‌గా పట్టించుకోవ‌టం లేద‌న్న ఆరోప‌ణ ఉంది. అదే స‌మ‌యంలో.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ది కూడా త‌ప్పు ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. దీనిపై పోచారం వారి స‌మాధానం ఏమిటో చూడాలి.