Begin typing your search above and press return to search.
ఏపీ కోసం...రంగంలోకి రాహుల్
By: Tupaki Desk | 9 Sep 2016 8:37 AM GMTప్రత్యేక హోదా అస్త్రంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. విభజన కారణంగా ఏపీలో ఘోరంగా నష్టపోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి అదే ఎజెండాతో రాష్ట్రంలో పుంజుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక హోదాతో ఏపీలో హల్ చల్ చేసిన కాంగ్రెస్ ఇపుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై నిరసన రూపంలో ఉనికిని బలపర్చుకునేందుకు సిద్ధం అవుతోంది. ఏపీ కేంద్రంగా ఏకంగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ఆకాంక్షల విషయంలో బీజేపీ మోసం చేసిందన్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ అక్టోబరు తొలివారంలో విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరవుతారని అన్నారు. విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ర్రాష్టాన్ని అభివద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక హోదా తప్పనిసరి అన్నారు. ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలన్న బీజీపీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. తమ పార్టీ ఎంపీ కేవీపీ ప్రైవేటు బిల్లును ఓటింగ్ కు రాకుండా అడ్డుకోవడం దారుణమని సుబ్బిరామిరెడ్డి మండిపడ్డారు. హోదాపై నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీకి దక్కే రైల్వేజోన్ విశాఖకే రావాలన్నారు. సీఎం చంద్రబాబు - కేంద్ర మంత్రి వెంకయ్య రాష్ట్రం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కేంద్రం కరుణించడం లేదని సుబ్బిరామిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.