Begin typing your search above and press return to search.
వైసీపీ వైపు చూస్తున్న కాంగ్రెస్ రెడ్డిగారు..!
By: Tupaki Desk | 21 Sep 2019 1:30 AM GMTకాంగ్రెస్ పార్టీలోని మహామహులంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ను వీడి జగన్ తొలి సారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడే కొందరు నేతలు కదిలారు. ఆ తర్వాత వివిధ దశల్లో అనేక మంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత కుంచించుకుపోవడంతో ఆ పార్టీ భవితవ్యంపై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు.
జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం ఊపు మీద లేకపోవడంతో.. ఏపీలో కోలుకునే సంకేతాలు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి క్రమంలో ఆ పార్టీలో ఇంకా మిగిలిన ఇంగువ కట్టిన గుడ్డలు కూడా తమ దారి తాము చూసుకుంటున్నాయని సమాచారం. అలాంటి వారిలో ఇప్పుడు టీ సుబ్బరామిరెడ్డి పేరు వినిపిస్తూ ఉంది.
సుబ్బరామిరెడ్డి గురించి వేరే పరిచయం అక్కర్లేదు. ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగుతూ ఉన్నారు. తిరిగి రాజ్యసభకు నామినేట్ కావాలనేది సుబ్బరామిరెడ్డి ఆశగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన జగన్ పార్టీ వైపు చూస్తున్నట్టుగా సమాచారం. సుబ్బరామిరెడ్డి కళాబంధుగా - అందరివాడుగా మెలుగుతున్నారు. విశాఖ నుంచి గతంలో ఆయన ఎంపీగా వ్యవహరించారు కూడా. త్వరలోనే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించాలని కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో సుబ్బరామిరెడ్డి వంటి వారిని చేర్చుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరి అన్ని కుదిరితే రెడ్డిగారు త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చు కాబోలు!