Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ గూటికి సుబ్బ‌రామిరెడ్డి..!?

By:  Tupaki Desk   |   16 Aug 2016 6:25 AM GMT
జ‌గ‌న్ గూటికి సుబ్బ‌రామిరెడ్డి..!?
X
కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆమె కుటుంబానికి అత్యంత విధేయులు అనే తెలుగువారిలో తిక్క‌వ‌ర‌పు సుబ్బ‌రామిరెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటారు. ఆ కుటుంబానికి ఈయ‌న న‌మ్మిన బంటు! కొన్ని ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌ లోనే ఉంటూ ఆపార్టీ టిక్కెట్ ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా.. విధేయ‌త చాటుకున్న నేతగా పేరు తెచ్చుకున్నారు సుబ్బ‌రామిరెడ్డి. అలాంటాయ‌న ఇప్పుడు ఏపీ ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ గూటికి వ‌స్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. వైసీపీ అధినేత‌కు - సుబ్బ‌రామిరెడ్డికి మ‌ధ్య లింక్ క‌లిపేందుకు విశాఖ పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్రే బాధ్య‌త తీసుకున్నార‌నే టాక్ వినిపిస్తోంది. విష‌యం ఏంటో చూద్దాం.

రాజ‌కీయంగా ఏపీలో విశాఖప‌ట్నం ఎంతో యాక్టివ్‌. ఇక్క‌డి ప్ర‌జ‌లు వ‌రుస‌గా ఎక్కువ‌గా కాంగ్రెస్‌ కే మొగ్గుచూపేవారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్య‌ర్థి కంభంపాటిని విశాఖ ప్ర‌జ‌ల‌కు పార్ల‌మెంటుకు పంపారు. అదే స‌మ‌యంలో ఎంతో సెంటిమెంటు వండి వార్చినా.. వైసీపీ అధినేత మాతృమూర్తి విజ‌య‌మ్మ‌కు ఇక్క‌డ విజ‌యం ద‌క్క‌లేదు. దీంతో ఇప్పుడు వైసీపీ ఈ విశాఖ‌పై ప‌ట్టు సాధించేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తోంది. దీనికి తిక్క‌వ‌ర‌పు సుబ్బ‌రామిరెడ్డిని ఉప‌యోగించాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ డిసైడైయ్యార‌ట‌. అయితే, ఈయ‌న‌కు సుబ్బ‌రామిరెడ్డికి మ‌ధ్య అంత‌గా రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రిపే ఫ్రెండ్‌ షిప్‌ లేదు. దీంతో గ‌త కొన్నాళ్లుగా త‌న‌ను చేర‌దీసి - స‌ల‌హాలు - సూచ‌న‌లు ఇస్తున్న ఆధ్యాత్మిక గురువు స్వ‌రూపానంద రంగంలోకి దిగార‌ని స‌మాచారం.

సుబ్బ‌రామిరెడ్డికి - జ‌గ‌న్‌ కు చెలిమి కుదిరేలా ఆయ‌న రాయ‌బారం నిర్వ‌హిస్తున్నార‌ట‌. ఇది గ‌న‌క వ‌ర్క‌వుట్ అయితే.. తిక్క‌వ‌ర‌పు హ‌స్తానికి గుడ్ బై చెబుతార‌నే టాక్ న‌డుస్తోంది. అయితే, ఇక్క‌డ ఆలోచించాల్సి విష‌యం ఏంటంటే.. ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌ లో ఉన్న తిక్క‌వ‌ర‌పు అంత తేలిగ్గా.. సోనియ‌మ్మ‌ను వ‌దిలేసి వ‌చ్చేస్తారా? అనేది ప్ర‌శ్న‌. అందునా.. వ‌చ్చే ద‌ఫా అయినా.. అధికారంలోకి వ‌స్తాడో రాడో అనే డౌట్‌ లో ఉన్న జ‌గ‌న్ పార్టీ కోసం ఆయ‌న అంత త్యాగం చేస్తాడా? అనేది కూడా ప్ర‌శ్నే. ముచ్చ‌ట‌గా మూడో సందేహం ఏంటంటే.. సుబ్బ‌రామిరెడ్డికి ఏపీ స‌హా హైద‌రాబాద్‌ - ముంబై - ఢిల్లీల్లో హోట‌ళ్లు - వ్యాపారాలు తెగ ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ అతిపెద్ద జాతీయ పార్టీని విడిచి పెట్టి.. ఓ చిన్నప్రాంతీయ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా? ఏమో చూడాలి. జ‌గ‌న్ ఎంతో విశ్వ‌సించే స్వ‌రూపానందేంద్ర రాయ‌బారం! ఏం జ‌రుగుతుందో చూడాలి?!