Begin typing your search above and press return to search.

బాబు సమక్షంలో టీటీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

By:  Tupaki Desk   |   7 April 2017 9:07 AM GMT
బాబు సమక్షంలో టీటీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలంగాణ టీడీపీ నేత ఒకరు ఆత్మహత్యకు యత్నించారు. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ లీడర్ అర్షంస్వామి ఇలా చంద్రబాబు సమక్షంలో ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

తెలంగాణలోని హన్మకొండలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహం ఈరోజు జరిగింది. ఈ వేడుకకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఆర్థిక సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు అర్షంస్వామి ప్రయత్నించాడు. తన కష్టాలు చెప్పుకోవడానికి యత్నించాడు. అయితే, చంద్రబాబు వద్దకు వెళ్లనీయకుండా పలువురు అడ్డుకున్నారు. దీంతో, మనస్తాపానికి గురైన అర్షంస్వామి వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే, పక్కనున్నవారు వెంటనే అతన్ని అడ్డుకుని... దారుణం చోటు చేసుకోకుండా వ్యవహరించారు. అతన్ని అక్కడ నుంచి తీసుకెళ్లారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత చంద్రబాబు వరంగల్ కు రావడం ఇదే తొలిసారి. దీంతో స్థానిక తెలుగుదేశం నేతలు ఆయనకు స్వాగతం పలికారు. వధూవరులను ఆశీర్వదించిన చంద్రబాబు, అక్కడి నేతలతో కాసేపు మాట్లాడారు. అంతకుముందు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని హెలిపాడ్ లో దిగిన ఆయన, కారులో హంటర్ రోడ్డులో విష్ణుప్రియ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వివాహ మండపానికి వచ్చారు. కాగా చంద్రబాబు రావడం.. ఆయన ఎదుట ఆత్మహత్యాయత్నం జరగడంతో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఆయన అడుగు పెడితే అంతేనంటూ పోస్టింగులు పెడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/