Begin typing your search above and press return to search.
స్వాత్రంత్య్ర పోరాటం..జైలుకు వెళ్లడం ఒకటే
By: Tupaki Desk | 6 Dec 2016 5:51 AM GMTతెలుగుదేశం పార్టీ నాయకులు చేసే వాదనలు ఎంత ఆశ్చర్యకరంగా ఇంకా చెప్పాలంటే ఒకింత విస్మయం కలిగించేలా ఉంటాయనేందుకు ఇదే నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి టీడీపీ నేత రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం మన దేశానికి స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు కారణమైన స్వాత్రంత్య్ర పోరాటంతో సమానమట. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క ప్రకటించారు.
సీతక్క సారథ్యంలో జరిగిన ములుగు జిల్లా సాధనకు మద్దతుగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం - టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి - ప్రజా గాయని విమలక్క పాల్గొన్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఓటుకు నోటు నేరగాడైన రేవంత్ తో వేదిక పంచుకునేందుకు కోదండరాంకు సిగ్గుందా అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై సీతక్క స్పందిస్తూ "ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి ప్రయత్నించాడనే నెపంతో కుట్రపూరితంగా ప్రభుత్వం రేవంత్ రెడ్డిని జైలుకు పంపించింది. జైలుకు వెళ్లిన వారందరూ నేరస్తులా? స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది జైలుకు వెళ్లారని గుర్తించుకుంటే మంచిది. రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం వలన ప్రభుత్వ పెద్దలకు వణుకు పడుతున్నది. నోటి దురుసు మానుకొని రైతుపోరు యాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి" అని టీఆర్ ఎస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రజా గాయని అయిన విమలక్క ఏం చేసిందని వారి కార్యాలయాన్ని సీజ్ చేశారని సీతక్క ప్రశ్నించారు. విమలక్క పాడిన పాటలతో అధికారంలోకి వచ్చారని, ఆమె భర్త రాసిన పాటలను మీరు పాడించుకోలేదా, విప్లవ సాహిత్యం ఉందన్న పేరుతో కార్యాలయాన్నిసీజ్ చేయడం అప్రజాస్వామికం అని మండిపడ్డారు. కవిత కరెన్సీ, డాలర్ల బతుకమ్మ ఆడితే విమలక్క బహుజనుల వద్ద బతుకమ్మ ఆడి బతుకమ్మ అంటే ఏమిటో చూపించిందని తెలిపారు. ములుగు ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/