Begin typing your search above and press return to search.
విదేశీ వ్యాక్సిన్ అయితే ఏళ్లు పట్టేది: మోడీ
By: Tupaki Desk | 7 Jun 2021 4:30 PM GMTప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు చాలా తక్కువ అని.. మనం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకోకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేదని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల అవసరాలు తీరాకే మనకు వ్యాక్సిన్ ఇచ్చేవాళ్లు అని మోడీ నిజాలు చెప్పుకొచ్చారు.
ఈరోజు సాయంత్రం జాతినుద్దేశించి మాట్లాడిన మోడీ ఈ సందర్భంగా రాష్ట్రాల తీరును, ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కరోనాతో దేశ ప్రజలు ఎంతో బాధ అనుభవించారన్న మోడీ.. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ ఎప్పుడూ అవసరం పడలేదన్నారు. ఈ సమయంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10రెట్లు పెంచామని తెలిపారు.
ఆర్మీ,నేవి, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్ కొరత తీర్చామని ప్రధాని మోడీ తెలిపారు. ప్రభుత్వం పనిచేయలేదన్న వారికి ఇదే మా సమాధానం అని మోడీ అన్నారు.
ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూ రాలేదని మోడీ అన్నారు. ఆధునిక కాలంలో ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూ చూడలేదని.. గత 100 ఏళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి అని అన్నారు. మనకు మనం వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసుకోకపోతే విదేశాల నుంచి రావాలంటే సంవత్సరాలు పట్టేదని మోడీ అన్నారు.