Begin typing your search above and press return to search.
వరుణుడి రద్దు పద్దులో ఒకే రోజు రెండు టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు.. పెద్ద జట్లకు దెబ్బే?
By: Tupaki Desk | 28 Oct 2022 11:55 AM GMTఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య టి20 ప్రపంచ కప్ మ్యాచ్.. అందులోనూ ఆస్ట్రేలియాలో ఎవరికైనా ఆసక్తి కలిగించే మ్యాచే ఇది. కానీ, వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అఫ్గానిస్థాన్-ఐర్లాండ్ మ్యాచ్.. రెండూ కసి ఉన్న జట్లు. రషీద్ ఖాన్ లాంటి మేటి బౌలర్ తో పాటు ఆండీ బాల్ మిర్నీ వంటి మెరుపు బ్యాట్స్ మెన్ ల ప్రతిభను చూడొచ్చు. కానీ, వర్షం కారణంగా రద్దు... ఇదీ టి20 ప్రపంచ కప్ లో శుక్రవారం పరిస్థితి. ఒకే రోజు రెండు మ్యాచ్ లూ రద్దవడంతో సాధారణ ప్రేక్షుకులతో పాటు అభిమానులూ నిరాశ చెందారు.
ఆసీస్, ఇంగ్లండ్ లకు ఇది కీలక మ్యాచే..
ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ లకు ఇది కీలక మ్యాచ్. న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఆసీస్ కు, ఐర్లాండ్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఇంగ్లండ్ కు తప్పక గెలవాల్సిన మ్యాచ్ లు. ఐదు మ్యాచ్ లకు గాను మూడు మ్యాచ్ లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ కేవలం మూడు పాయింట్ల (రన్ రేట్ +0.239) తోనే ఉంది. ఆసీస్ (రన్ రేట్ -1.555) ది కూడా ఇదే పరిస్థితి అయినప్పటికీ.. నెట్ రన్ రేట్ లో ఇంగ్లండ్ కాస్త మెరుగు. చిత్రమేమంటే.. వీరిద్దరి కంటే శ్రీలంక పరిస్థితి బాగుంది. ఆ జట్టు 2 మ్యాచ్ లాడి ఒకదాంట్లో ఓడి మరోటి గెలిచింది. రన్ రేట్ కూడా (+0.450) బాగుంది.
ఓడితే ఒకటి ఇంటికే
ఆసీస్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగి.. ఓడిన జట్టు దాదాపు ఇంటికెళ్లే పరిస్థితి. కానీ, వరుణుడు అడ్డొచ్చి సందిగ్ధ పరిస్థితి కల్పించాడు. వాస్తవానికి ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయావకాశాలు 50-50 ఉండగా వరుణుడు అడ్డుపడ్డాడు.
ఇప్పుడు మరోలా దెబ్బకొట్టాడు. ఇదే గ్రూప్ ''ఎ''లో బుధవారం న్యూజిలాండ్ -అఫ్గానిస్థాన్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. దీంతో అఫ్గానిస్థాన్ మూడు మ్యాచ్ లు పూర్తయ్యేసరికి కేవలం 2 పాయింట్లతో ఉంది.
భారత్ కు ఇప్పటికైతే దెబ్బ లేదు
కాగా, గ్రూప్ 'బి'లో టీమిండియాకు ఇప్పటివరకైతే వరుణుడు ఎదురుకాలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో గత వారం జరిగిన మ్యాచ్ లోనే వర్షం పడుతుందని భావించినా.. మ్యాచ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. నెదర్లాండ్స్ తో మ్యాచ్ కూడా ఇంతే. ఆదివారం దక్షిణాఫ్రికాను ఎదుర్కొనాల్సి ఉంది. అయితే, దక్షిణాఫ్రికా కూడా వర్సం బాధితురాలే. గురువారం పాకిస్థాన్ ను ఓడించిన జింబాబ్వే పరిస్థితీ ఇదే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం గమనార్హం.
పెద్ద జట్లకు దెబ్బే..
వరుణుడు ఈ టోర్నీలో కనీసం రెండు పెద్ద జట్లకు అయినా షాకిచ్చేలా ఉన్నాడు. గ్రూప్ ఏలోని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లలో ఒకరికి ఈ షాక్ తప్పదనేలా కనిపిస్తోంది. ఈ రెండింటిలో కనీసం ఒకటైనా లీగ్ దశలోనే ఇంటికెళ్లడం ఖాయం. మరోవైపు గ్రూప్ బిలో రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన పాకిస్థాన్ కు తిప్పలు తప్పేలా లేవు. భారత్ మంచి జోరు మీద ఉండగా.. రెండో బెర్తు దక్షిణాఫ్రికాకు ఖాయంగా కనిపిస్తోంది. ఏతావాత చెప్పేదేమంటే.. ఆస్ట్రేలియాలో కాలం కాని కాలంలో అక్టోబరులో ప్రపంచ కప్ నిర్వహణ సరికాదని...
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.