Begin typing your search above and press return to search.

టీ-20 విజ‌యం ఇస్లాంద‌ట‌.. పాక్ త‌న బుద్ధిని బ‌య‌ట పెట్టుకుందిగా!

By:  Tupaki Desk   |   26 Oct 2021 7:02 AM GMT
టీ-20 విజ‌యం ఇస్లాంద‌ట‌.. పాక్ త‌న బుద్ధిని బ‌య‌ట పెట్టుకుందిగా!
X
భార‌త్‌ పై పాకిస్థాన్ త‌న బుద్ధిని ఏమాత్రం మార్చుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. నిరంత‌రం.. భార‌త్‌ ను రెచ్చ‌గొట్టి.. చితిమంట‌ల్లో చ‌లికాచుకుంటున్న పాకిస్థాన్‌.. తాజాగా జ‌రిగిన టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ను కూడా అదే దృష్టితో చూసింది. రెండు రోజుల కింద‌ట జ‌రిగిన టీ-20 వరల్డ్‌ కప్‌ లో దాయాది దేశాల మధ్య జరిగిన రసవత్తరపోరులో టీమీండియా ఓడిపోయింది. దీనిని ప్ర‌పంచ దేశాలు కూడా స్పోర్టివ్‌ గా తీసుకున్నాయి. భార‌త్‌ కూడా ఎక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు. ఇక‌, క్రికెట్ అభిమానులు కూడా.. పాక్ విజ‌యాన్ని స్వాగ‌తించారు. ఎక్క‌డా ప‌రుష ప‌ద‌జాలం ప్ర‌యోగించ‌లేదు.

భార‌త ప‌త్రిక‌లు కూడా ఈ విష‌యాన్ని ఆచితూచి చూశాయే త‌ప్ప‌.. ఎక్క‌డా వైష‌మ్యాలు పెంచేలా రాయ‌లేదు. కానీ, పాకిస్థాన్‌ కు చెందిన మంత్రి మాత్రం త‌న బుద్ధిని బ‌య‌ట పెట్టుకున్నారు. క్రీడను క్రీడలా చూడకుండా భారత్‌ పై ఉన్న తమ అక్కసును వెళ్లగక్కారు. భారతదేశం పై పాక్‌ సాధించిన విజయాన్ని `ఇస్లాం విజయం` అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

పాకిస్తాన్‌ కు చెందిన మినిస్టర్‌ షెయ్‌ రషీద్‌ అహ్మద్‌ టీమిండియా పై పాక్‌ విజయం అనంతరం స్పందించారు. ‘‘ఇండియా-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక వర్గం ప్రజలు పాకిస్తాన్‌ కే మద్దతు తెలిపారు. మేమే గెలవాలని కోరుకున్నారు. పాకిస్తాన్‌ వరకు నిన్న జరిగిన మ్యాచ్‌ ఫైనల్‌ తో సమానం. ఇది పాక్‌ విజయం కాదు.. ఇస్లాం విజయం’’ అని వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌ పై అంత‌ర్జాతీయ స‌మాజం ఎలా స్పందిస్తుందో తెలియ‌దు కానీ.. ఇప్ప‌టికైతే.. క్రికెట్ అభిమానులు మండిప‌డుతున్నారు. విజ‌యాన్ని విజ‌యంగా స్వీక‌రించ‌లేని ప‌రిస్థితిలో పాక్ ఉంద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతేకాదు.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. పాకిస్తాన్ గెలిచింద‌నే సంతోషం లేకుండా.. ఈ వ్యాఖ్య‌లేంట‌ని మండి ప‌డుతున్నారు. ఇస్లాందే విజ‌యం అయితే.. ఇన్నేళ్లు ఎందుకు గెల‌వ‌లేదు.. ? ఆ అల్లా.. ఆగ్ర‌హించాడా..? అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా పాక్ త‌న బుద్ధిని మార్చుకుని ఎక్క‌డ రాజ‌కీయం చేయాలో అక్క‌డ చేస్తే బెట‌ర్ అంటున్నారు.