Begin typing your search above and press return to search.

టీ20 ప్రపంచకప్‌ పై గ్రేమ్ స్వాన్ జోస్యం .. ఆ జట్టే గెలుస్తుందట !

By:  Tupaki Desk   |   23 Aug 2021 6:45 AM GMT
టీ20 ప్రపంచకప్‌ పై గ్రేమ్ స్వాన్ జోస్యం .. ఆ జట్టే గెలుస్తుందట !
X
అక్టోబర్-నవంబర్ మధ్య యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.మొదటిగా ఈ టోర్నమెంట్ ఇండియాలో జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా అది కాస్తా యూఏఈకి తరలించారు. అత్యంత బయోబబుల్ నిబంధనల నడుమ ఈ టోర్నీని నిర్వహించనున్నారు. ఐపీఎల్ సెకండాఫ్ ఫైనల్ అనంతరం రెండు రోజులకు అంటే అక్టోబర్ 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ నవంబర్ 14న జరగనున్న సంగతి తెలిసిందే. సూపర్ 12లోని గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండిస్ జట్లు తలబదనుండగా.. గ్రూప్ 2లో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్తాన్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ రెండు గ్రూప్‌ లలోని ఫైనల్ స్లాట్స్ కోసం రౌండ్-1 గ్రూప్ ఏ, గ్రూప్ బీ టీమ్స్ తలబడుతున్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అదే గ్రూప్ 2లో టీమిండియా.. పాకిస్తాన్‌ తో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు కూడా ఉన్నాయి.

ఈసారి భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రసవత్తర పోరులు జరగనున్నాయని అందరూ అంచనా వేస్తున్నారు. మరోవైపు పొట్టి కప్‌ను ఈసారి ఏ జట్టు గెలుస్తుందో మాజీలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఫేవరేట్ జట్టేదో తెలియజేశాడు. టీ20 ప్రపంచకప్‌ 2021ను భారత్ కంటే వెస్టిండీస్ జట్టే గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న విండీస్ పొట్టి కప్‌ను గెలుస్తుందన్నాడు. ఈసారి టీ20 ప్రపంచకప్‌ విజేత ఎవరనుకుంటున్నారు అని గ్రేమ్ స్వాన్‌ను ప్రెజెంటర్ డానిష్ సైట్ అడగ్గా.. 'ఈ టోర్నమెంట్ ప్రణాళిక ప్రకారం భారతదేశంలో జరిగితే.. కోహ్లీసేననే ఫేవరేట్. కానీ ఇప్పుడు వేదిక మారింది.

యూఏఈలో పొట్టి కప్‌ జరుగుతుంది కాబట్టి.. కచ్చితంగా వెస్టిండీస్ విజేతగా నిలుస్తుంది. విండీస్ నా ఫేవరేట్. విండీస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో ఓ పవర్ ఉందని తెలిపాడు. ప్రస్తుతం విండీస్ జట్టులో ఉన్నవారు అందరూ టీ20 ఆటగాళ్లే. విండీస్ బోర్డు ఇచ్చే వేతనాలు తక్కువ కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు లీగుల్లో ఆడాడనికి కరేబియన్ ప్లేయర్స్ ఆసక్తిచూపిస్తారు. అంతర్జాతీయ జట్టుకు కాకుండా కేవలం ప్రైవేట్ లీగుల్లో ఆడుతున్న ప్లేయర్స్ కూడా వారికి అందుబాటులో ఉన్నారు. అందుకే టీ20 ఫార్మాట్‌ లో విండీస్ పటిష్టంగా ఉంటుంది. క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్ మరియు కిరోన్ పోలార్డ్ వంటి స్టార్ ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో ఉన్నారు. ఇందులో పూరన్ మినహా మిగతావారందరూ గత రెండు ప్రపంచకప్‌ లు గెలిచిన జట్టులోని సభ్యులే. 2012, 2016 ప్రపంచకప్‌లను విండీస్ గెలుచుకుంది. ఇప్పుడు మూడో టోర్నీపై కన్నేసింది.

టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ తాజాగా పేర్కొన్నాడు. జోష్ జట్టులో చోటు దక్కించుకోవడం అద్భుతంగా ఉంది. అతడు సరదాగా పరుగులు చేస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ బాగుంది. సీనియర్లు కీలక పాత్ర పోషిస్తారు. టీ20 ప్రపంచకప్‌ గెలిచే సత్తా ఈ జట్టుకు ఉందని భావిస్తున్నా అని పాంటింగ్ ట్వీట్‌ చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో తిరుగులేని అధిపత్యం ప్రదర్శిస్తూ.. ఐదుసార్లు విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. కానీ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌ని ఒక్కసారి కూడా ఆసీస్ ముద్దాడలేదు.