Begin typing your search above and press return to search.

అయ్యయ్యో .. ట్రంప్ ను ఈ విధంగా కూడా వాడేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   17 Aug 2020 11:30 PM GMT
అయ్యయ్యో  .. ట్రంప్ ను ఈ విధంగా కూడా వాడేస్తున్నారా ?
X
బ్రిటన్ ‌లో బెడ్ ఫోర్డ్ షైర్ ప్రాంతంలో డ్రగ్స్ రావాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. మాదక ద్రవ్యాలో తయారు చేసిన ట్యాబ్లెట్ల పై ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖం ఉండటంతో పోలీసులు షాక్ అయ్యారు. అతని పేరుతోనే వాటిని అమ్మకాలు కూడా జరుపుతున్నామని వెల్లడించారు. బ్రిటన్ ‌లో బెడ్ ఫోర్డ్ షైర్ ప్రాంతంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డ్రగ్ ముఠాతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న డ్రగ్ మాత్రలను స్వాధీనం చేసుకోగా, ఆ మాత్రలపై డొనాల్డ్ ట్రంప్ ముఖంను ముద్రించారు. ఆరెంజ్ కలర్‌ లో ఈ ట్యాబ్ లెట్స్ తయారు చేసి ‘ట్రంప్ పిల్స్’ పేరుతో ఎవరికి అనుమానం రాకుండా అమ్మకాలు చేస్తున్నారు. . కాగా వీటిలో ప్రమాదకరమైన ఎండీఎంఏ అనే పదార్థం ఉంటుంద అధికారులు గుర్తించారు. దీని వల్ల హృదయస్పందన వేగం పుంజుకుంటుందని తీవ్ర అస్వస్థతకు గురౌతారని అంటున్నారు. చాక్లెట్ల రూపంలో ముఠా తయారు చేసిన ఈ మాత్రలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.