Begin typing your search above and press return to search.

ఆ రాష్ట్రంలో కరోనా రోగులు నర్సుల్ని అంతలా వేధిస్తున్నారట!

By:  Tupaki Desk   |   3 April 2020 7:50 AM GMT
ఆ రాష్ట్రంలో కరోనా రోగులు నర్సుల్ని అంతలా వేధిస్తున్నారట!
X
షాకింగ్ అంశం ఒకటి బయటకు వచ్చింది. కరోనా రోగుల కుటుంబ సభ్యులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు.. వైద్య సిబ్బందిపై దాడి ఉదంతాన్ని మర్చిపోక ముందే మరో దారుణం బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రుల్లో కరోనా పాజిటివ్ గా తేలిన పలువురు తమ తీరుతో వైద్యుల్ని.. వైద్య సేవల్ని అందించే నర్సుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి తాజాగా కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలోని నిర్వహించిన సదస్సులో పాల్గొన్న తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ఆరుగురు కరోనా పాజిటివ్ గా తేలటంతో వారిని ఐసోలేషన్ వార్డులో తరలించారు. వారంతా అర్థనగ్నంగా తిరుగుతూ నర్సుల్ని వేధిస్తున్నట్లుగా ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కొత్వాలీ ఘంటాఘర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న జమాత్ సభ్యులు ఆరుగురు వైద్య సిబ్బందిని వేధిస్తున్నట్లు పేర్కొన్నారు.

మహిళా నర్సుల వద్ద అశ్లీల పాటలు పాడటం.. తమకు సిగిరెట్లు.. బీడీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డులో చేరిన ఆరుగురు రోగుల తీరు ఒకేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోగంతో బాధ పడే వారు వైద్యులకు సహకరించాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ అంశంపై తాము సమగ్ర దర్యాప్తును చేస్తున్నట్లుగా ఘజియాబాద్ నగర ఎస్పీ వెల్లడించారు.