Begin typing your search above and press return to search.
జేసీ నోట సారీ మాట!..ఎవరికి చెప్పారంటే?
By: Tupaki Desk | 30 March 2019 10:47 AM GMTఏంటీ... జేసీ చెప్పారా? నిజమా? అబ్బే.. మేం నమ్మం అంటారా? అయినా ఎప్పుడూ ఎగిరెగిరి పడే జేసీ సారీ చెప్కడమేమిటబ్బా అంటారా? అయితే ఈ విషయం తెలుసుకుని తీరాల్సిందే. ఎందుకంటే... జేసీ నిజంగానే సారీ చెప్పారు. అది కూడా నిత్యం తను విరుచుకుపడే వైసీపీ కార్యకర్తలకు ఆయన సారీ చెప్పారు. జేసీ అంటే... ఇక్కడ జేసీ దివాకర్ రెడ్డా? లేక ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డా?... నో డౌట్... జేసీ ప్రభాకర్ రెడ్డే. జేసీ దివాకర్ రెడ్డి సారీ చెప్పారంటే ఎలాగోలా నమ్మొచ్చేమో కానీ... జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పారంటే నమ్మశక్యంగా అనిపించదు. ఎందుకంటే... జేసీ దివాకర్ రెడ్డి మాటలతో చిత్తు చేస్తే... ప్రభాకర్ రెడ్డి మాత్రం చేతలతోనే పరుగులు పెట్టించే రకం. అలాంటిది జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పారంటే నమ్మేదెలా? సరే.. జేసీ ప్రభాకర్ రెడ్డి నిజంగానే సారీ చెప్పారు కాబట్టి ఈ వార్తను నమ్మి తీరాల్సిందే.
అయితే అసలు ఏం జరిగింది? జేసీ ఎందుకు సారీ చెప్పారు? ఎవరికి సారీ చెప్పారు? అన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా - జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే అనూహ్యంగా అన్నాతమ్ముళ్లిద్దరూ ఒకేసారి రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని.. ఇద్దరూ తమ తమ స్థానాల్లో తమ కుమారులను బరిలోకి దింపారు. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి టీడీపీ ఎమ్యెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎంత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని చెప్పినా... కుమారుడి గెలుపు కోసం శ్రమించకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా ఉంటారు? ఈ లెక్కనే కుమారుడిని వెంటేసుకుని నియోజకవర్గం మొత్తం సుడిగాలిలా చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో నేటి ఉదయం నియోజకవర్గంలోని పుట్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించేందుకు కుమారుడిని వెంటేసుకుని ప్రభాకర్ రెడ్డి బయలుదేరారట. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం వద్దకు రాగానే వీరి కాన్వాయ్‌లోని ఓ కారు అటుగా వెళుతున్న ఓ బైక్ ను ఢీకొట్టిందట. దీంతో బైక్‌పై వెళుతున్న వారు అల్లంత దూరంలో పడిపోయారట.
ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ తిన్న ప్రభాకర్ రెడ్డి హుటాహుటీన అందరికంటే ముందుగా కారు దిగేసి బాధితుల వద్దకు పరుగు పెట్టారట. కిందపడిపోయిన వ్యక్తులు వైసీపీ కార్యకర్తలని గుర్తించి కూడా ప్రభాకర్ రెడ్డి వారికి సపర్యలు చేసేందుకు ఉద్యుక్తులయ్యారట. అయితే ఈ ప్రమాదంలో బాధితులకు పెద్దగా గాయాలేమీ కాకపోవడంతో ప్రభాకర్ రెడ్డి సపర్యలు అవసరం లేకపోయాయట. అయితే గాయాలు కాకపోయినా... ఎంతైనా ప్రమాదం ప్రమాదమే కదా.... అందుకే వెంటనే ప్రభాకర్ రెడ్డి బాధితులు వైసీపీ కార్యకర్తలు అని తెలుసుకుని కూడా వారికి క్షమాపణ చెప్పారట. డ్రైవర్ కారణంగా ఈ తప్పు జరిగిందనీ - క్షమించాలని ఆయన వారిని కోరారట. నిత్యం అగ్గి సెగలు కక్కే జేసీ ప్రభాకర్ రెడ్డి తమకు సారీ చెప్పడంతో షాక్‌కు గురైన వైసీపీ కార్యకర్తలు ఫరవా లేదని చెబుతూనే అక్కడి నుంచి తుర్రుమన్నారట. మొత్తంగా ఈ ఘటనతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాను మారిపోయినట్టుగా రుజువు చేసుకున్నారన్న మాట.