Begin typing your search above and press return to search.

తాడిపత్రి ట్విస్ట్: హైకోర్టుకు వైసీపీ.. ఎక్స్ ఆఫీషియోనే కీలకం

By:  Tupaki Desk   |   16 March 2021 8:39 AM GMT
తాడిపత్రి ట్విస్ట్: హైకోర్టుకు వైసీపీ.. ఎక్స్ ఆఫీషియోనే కీలకం
X
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మెజార్టీ డివిజన్లను టీడీపీ గెలుచుకుంది. ఏపీ వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం అడ్డంగా నిలబడ్డాడు. దీంతో అక్కడ టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది. మార్చి 18 న మున్సిపల్ చైర్‌పర్సన్‌లకు ఎన్నికలు జరగనుంది. 36 మంది సభ్యుల మునిసిపల్ కౌన్సిల్‌లో సాధారణ మెజారిటీతో కొట్టుమిట్టాడుతున్న అధికార వైయస్ఆర్ కాంగ్రెస్‌కు మెజారిటీ పొందడానికి చాలా కష్టంగా ఉంది.దీంతో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది.

ఈ ఎన్నికల్లో టీడీపీ 18 వార్డుల్లో విజయం సాధించగా.. వైసీపీ 16 వార్డుల్లో గెలుపొందింది. అయితే ఎక్స్ అఫిషీయో ఓట్లతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీ భావించింది.

ఈ క్రమంలోనే తాము ఓటింగ్ లో పాల్గొంటామంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, వైసీపీ తరుఫున ఓటు వేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, వెన్నపూస గోపాల్ రెడ్డి, శమంతకమణి చేసిన విజ్ఞప్తిని తాడిపత్రి పురపాలక సంఘం ఎన్నిక అధికారి నరసింహాప్రసాద్ రెడ్డి తిరస్కరించారు. పురపాలక సంఘం నిబంధనల మేరకే తిరస్కరించినట్టు ఆయన తెలిపారు.

దీంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. తాడిపత్రి ఎక్స్ అఫీషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్ నెలకొంది. ఓటు వేసేందుకు అర్హులని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య ఓట్లతో వైసీపీ బలం 18కి పెరిగింది. టీడీపీ బలం కూడా 18 కావడంతో ఇరు పార్టీల బలాలు సమానమయ్యాయి.

దీంతో ఇక్కడి నుంచి గెలిచిన సీపీఐ, స్వతంత్ర్య అభ్యర్థులు ఇద్దరిపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పుడు వీరిద్దరూ ఎటువైపు నిలిస్తే వారికే చైర్మన్ పీఠం దక్కనుంది. ఇప్పటికే టీడీపీ తమ కౌన్సిలర్లు ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు వారందరినీ ప్రత్యేక శిబిరానికి తరలించారు.

తాడిపత్రి ఎక్స్‌అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో ఓటును ఈసీ తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్‌, గోపాల్‌రెడ్డి, శమంతకమణి దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది. దీనిపై హైకోర్టుకు ఎక్కేందుకు వైసీపీ , టీడీపీ నేతలు రెడీ అయ్యారు.

తాడిపత్రిలో ఓటు హక్కు లేనందున ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో తిరస్కరించారని.. ఓటు హక్కు ఉన్న చోటే సభ్యత్వం ఉంటుందని కమిషనర్‌ తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎక్స్‌అఫిషియో ఓట్లు జారీ అయ్యాయి. 18న తాడిపత్రి మున్సిపల్ సమావేశానికి హాజరుకావాలని అధికారులు లేఖ రాశారు.

కోర్టులో పిటీషన్ చేసి, తాడిపత్రి కౌన్సిల్‌లో ఓటు వేసి చైర్మన్ పదవిని చేపట్టాలని ఎంఎల్‌సిలకు ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.