Begin typing your search above and press return to search.
పట్టపగలు పెట్రోల్ పోసి తహసీల్దార్ హత్య
By: Tupaki Desk | 4 Nov 2019 11:22 AM GMTరంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో తహసీల్దార్ విజయారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పటించి హత్య చేశాడు. తహసీల్దార్ ఆఫీసులోనే జరిగిన ఈ దారుణం కలకలం రేపింది.
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో ఓ దుండగుడు మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రవేశించాడు. తహసీల్దార్ విజయారెడ్డి తో మాట్లాడాలంటూ ఆమె చాంబర్ లోకి వెళ్లగా అటెండర్ అడ్డుకున్నాడు. మేడమ్ మీటింగ్ లో ఉందంటూ కాసేపు ఆపాడు.
ఆ తర్వాత అరగంటకు ఆమె చాంబర్ లోకి వెళ్లిన ఆ దుండగుడు దాదాపు 30 నిమిషాలపాటు తహసీల్దార్ తో మాట్లాడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత ఒక్కసారిగా తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను తహసీల్లార్ విజయారెడ్డిపై పోసి ఆమెపై నిప్పటించాడు. అనంతరం అక్కడి నుంచి బయటకు వెళ్లి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
పెట్రోల్ పోయడంతో తహసీల్దార్ విజయారెడ్డి తన చాంబర్ నుంచి కారిడార్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చి అరుస్తూ కాపాడాలని ఆర్తనాదాలు చేసింది. కానీ అప్పటికే మంటలకు పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పట్టపగలు ఏకంగా ప్రభుత్వ ఆఫీసులోనే తహసీల్దార్ ను హత్య చేసిన దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.